టీమిండియాలోకి వైభవ్‌ సూర్యవంశీ.. ఇంతకీ అతడికి పాస్‌పోర్ట్ ఉందా? | Vaibhav Sooryavanshis India Selection Debate Draws Cheeky Remark | Sakshi
Sakshi News home page

టీమిండియాలోకి వైభవ్‌ సూర్యవంశీ.. ఇంతకీ అతడికి పాస్‌పోర్ట్ ఉందా?

Apr 24 2026 4:17 PM | Updated on Apr 24 2026 4:31 PM

Vaibhav Sooryavanshis India Selection Debate Draws Cheeky Remark

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీపై ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్లు మైఖేల్ వాన్, డేవిడ్ లాయిడ్, అలస్టైర్ కుక్, అలెక్స్ హార్ట్లీప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ దిగ్గ‌జ క్రికెట‌ర్లు తాజాగా వైభ‌వ్ ప్రదర్శనపై  'స్టిక్ టు క్రికెట్' (Stick to Cricket) పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర చర్చ జరిపారు.

ఈ సంద‌ర్భంగా వీరంతా వైభ‌వ్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఐర్లాండ్‌తో టూర్‌తో వైభ‌వ్ సీనియ‌ర్ జ‌ట్టులోకి అరంగేట్రం చేస్తాడ‌ని వాన్ జోస్యం చెప్పాడు. వైభ‌వ్ ఒక అద్బుత‌మైన ఆట‌గాడ‌ని, అత‌డి టాలెంట్ చూస్తుంటే ముచ్చ‌టెస్తుంద‌ని అలెక్స్ హార్ట్లీ అభిప్రాయ‌ప‌డ్డాడు.

కాగా త‌న అరంగేట్ర ఐపీఎల్ సీజ‌న్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీతో చెల‌రేగిన 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ.. ఐపీఎల్‌-2026లో కూడా అదే దూకుడును కొన‌సాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌లు ఆడిన సూర్య‌వంశీ, 220.87 స్ట్రైక్ రేటుతో 256 పరుగులు చేశాడు.

ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ల మ‌ధ్య జ‌రిగిన సంబాష‌ణ ఇదే

మైఖ‌ల్ వాన్: సూర్య‌వంశీ నిజంగా ఒక సంచ‌ల‌న ఆట‌గాడు, ఈ ఏడాది ఐపీఎల్‌లో అత‌డి స్ట్రైక్ రేట్ 236గా ఉంది.

డేవిడ్ లాయిడ్:  అత‌డు ఇప్పుడు స్కూల్‌కి వెళ్లాలి క‌దా?  మ‌ధ్య‌లో స్కూల్ అలా మానేయ‌కూడ‌దు క‌దా వాన్‌!

వాన్‌: అత‌డు మ‌ళ్లీ స్కూల్‌కు వెళ్తాడ‌ని నేను అనుకోను డేవ్‌. వైభ‌వ్ ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే భార‌త జ‌ట్టులో ఉంటాడ‌ని నేను అనుకుంటా? ఒక‌వేళ నేను సెల‌క్ట‌ర్ అయితే ఇంగ్లండ్ సిరీస్ కోసం వైభ‌వ్‌ను క‌చ్చితంగా ఎంపిక చేస్తాను.

టఫ్నెల్: అవును క‌చ్చితంగా సీనియ‌ర్ జ‌ట్టులోకి వ‌చ్చేందుకు అత‌డు అర్హుడు.

అలస్టైర్ కుక్: ఇంత‌కి వైభ‌వ్ ద‌గ్గ‌ర పాస్‌పోర్ట్ ఉందా?(న‌వ్వుతూ)

వాన్‌: అత‌డికి 20 ఏళ్లు ఉంటే మనందరం ఆశ్చర్యపోయేవాళ్లం కాదు. కానీ 15 ఏళ్ల‌లోనే ఇలా ఆడుతున్నాడు కాబ‌ట్టి అంద‌రూ జాగ్ర‌త్తగా ఉండాలి. బుమ్రాను సైతం అత‌డు వ‌ద‌ల్లేదు.

హార్ట్లీ: వైభ‌వ్‌కు ఆత్మ‌విశ్వాసం ఎక్కువ‌. ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు అత ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా, నిర్భయంగా ఆడుతున్నాడు. క‌చ్చితంగా అత‌డిని భార‌త జ‌ట్టుకు ఎంపిక చేయాలి.

వాన్‌:  భార‌త టీ20 జ‌ట్టుకు కొత్త ఓపెన‌ర్ అత‌డే. మరో ఎండ్‌లో జైస్వాల్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ వైభ‌వ్ ప్ర‌ద‌ర్శ‌నల కార‌ణంగా జైశ్వాల్ వెలుగులోకి రాలేక‌పోతున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement