Wasim Jaffer Turns Back Smashes 7 Boundaries in Legends League Cricket - Sakshi
Sakshi News home page

Legends League Cricket 2022: వరుసగా రెండో ఓటమి.. వసీం జాఫర్‌ మాత్రం తగ్గేదే లే

Jan 25 2022 10:02 PM | Updated on Jan 26 2022 10:52 AM

Wasim Jaffer Turns Back Smashes 7 Boundaries In Legends League Cricket - Sakshi

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో భారత జట్టు నిరాశపరుస్తోంది. ఇండియా మహరాజాస్‌ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్‌ 36 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. అయితే మ్యాచ్‌ ఓడినప్పటికి వసీం జాఫర్‌ తన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. నమన్‌ ఓజాతో కలిసి మంచి ఆరంభం ఇచ్చిన జాఫర్‌ 25 బంతుల్లో ఏడు బౌండరీలతో 35 పరుగులు సాధించాడు.

చదవండి: Shafali Verma: చరిత్ర సృష్టించిన షఫాలీ వర్మ.. తొలిసారి

టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో తక్కువే ఆడినప్పటికి.. కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రం జాఫర్‌ తనదైన ముద్ర వేశాడు. తాజాగా జరిగిన మ్యాచ్‌లో పాత జాఫర్‌ను గుర్తు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జాఫర్‌ క్రీజులో ఉన్నంతసేపు విజయం మనదేనని భావించినప్పటికి.. ఆ తర్వాత భారత్‌ ఆట పూర్తిగా నీరుగారిపోయింది. 

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసియా లయన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. తరంగ 72, అస్గర్‌ అఫ్గన్‌ 69 నాటౌట్‌ రాణించారు. ఆ తర్వాత భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహరాజాస్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement