Virat Kohli: ఇంగ్లీష్‌ పరీక్షలో విరాట్‌ కోహ్లిపై ప్రశ్న.. క్వశ్చన్ పేపర్ వైరల్‌

Virat Kohli question asked in a 9th standard English paper - Sakshi

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి.. గతేడాది జరిగిన ఆసియా కప్‌ నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫామ్‌ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోహ్లి, ఆసియాకప్‌-2022లో ఆఫ్గానిస్తాన్‌పై అద్భుతమైన సెంచరీతో తన పూర్వ వైభవాన్ని పొందాడు. తన రిథమ్‌ను పొందడమే కాకుండా సెంచరీ కోసం తన మూడేళ్ల నిరీక్షణకు విరాట్‌ తెరదించాడు. అది విరాట్‌ కోహ్లికి తన అంతర్జాతీయ కెరీర్‌లో 71వ సెంచరీ.

ఇక ఒకనొక దశలో కోహ్లిని జట్టు నుంచి తప్పించాలని పెద్దు ఎత్తున డిమాండ్లు వినిపించాయి. పాక్‌ మాజీ క్రికెటర్లు అయితే ఒక అడుగు ముందుకు వేసి కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని హేళన చేశారు. ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొని అద్భుతమైన పునరాగమనం చేసిన కోహ్లి.. ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్పూర్తిదాయకంగా నిలిచాడు.

                                                                                   

ఇక తాజాగా ఒక స్కూల్‌ కూడా విరాట్‌ కోహ్లి పట్టుదల, అలుపెరగని పోరాటానికి సలాం కొట్టింది. తమ స్కూల్‌లో 9వ తరగతి చదివే విద్యార్థులకు కోహ్లి పునరాగమనం గురించి వివరించాలని ప్రశ్న వేసింది. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అందులో విరాట్‌ కోహ్లి తన  71వ అంతర్జాతీయ సెంచరీ సెలబ్రేషన్‌ జరుపుకుంటున్న ఫోటో ఉంది. ఈ ఫోటో గురించి 100 లేదా 120  పదాల్లో వివరించాలని ప్రశ్నలో ఉంది.  ఇక ఇది చూసిన కింగ్‌ కోహ్లి ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి గురించి 100 పదాలు ఏంటి, పది పేజీలు అయినా రాయవచ్చు అంటూ అభిమానులు పోస్ట్‌లు చేస్తున్నారు.
చదవండి: క్రికెట్‌ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్‌.. ఇప్పటి వరకు చూసి ఉండరు! వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top