
టెస్టుల్లో అరంగేట్రం సందర్భంగా తనకు ఎదురైన అనుభవం గురించి టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana) తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఓవైపు తనను భయపెడుతుంటే.. మరోవైపు.. విరాట్ భయ్యా, రాహుల్ భయ్యా తనను ‘ఆందోళన’కు గురిచేశారంటూ సరదా విషయాలు పంచుకున్నాడు.
తొలి వికెట్‌గా అతడు
కాగా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు ద్వారా హర్షిత్ రాణా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో అతడు బంతితో రంగంలోకి దిగాడు.
ట్రవిస్ హెడ్ (11) రూపంలో తన తొలి అంతర్జాతీయ వికెట్ దక్కించుకున్న ఈ రైటార్మ్ పేసర్.. జిడ్డు ఇన్నింగ్స్‌తో క్రీజులో పాతుకుపోయిన మిచెల్ స్టార్క్ (112 బంతుల్లో 26)ను కూడా వెనక్కి పంపించాడు.
నాకు ఇది గుర్తుండిపోతుంది
ఈ క్రమంలో హర్షిత్.. స్టార్క్‌కు బౌన్సర్ సంధించగా.. బంతి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో కంగారుపడ్డ హర్షిత్.. అంతా ఒకేనా అన్నట్లు స్టార్క్‌కు సైగ చేశాడు. ఇందుకు బదులుగా.. ‘‘నేను నీకంటే ఫాస్ట్‌గా బౌల్ చేయగలను. నాకు ఇది గుర్తుండిపోతుంది’’ అంటూ స్టార్క్ సరదాగా వ్యాఖ్యానించాడు.
చచ్చానురా దేవుడా!
ఈ విషయం గురించి హర్షిత్ రాణా తాజాగా మాట్లాడుతూ.. ‘‘చాలా సేపటి తర్వాత ఆరోజు నేను స్టార్క్‌కు బౌన్సర్ వేశాను. అతడు స్లెడ్జ్ చేయగానే.. నేను నవ్వేశాను. కానీ.. తిరిగి బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నపుడు.. ‘చచ్చానురా దేవుడా!.. ఇక ఇప్పుడు అతడు నాకు కూడా బౌన్సర్సే వేస్తాడు’ అని భయపడ్డాను.
కొట్టు.. ఇంకా కొట్టు
ఇంతలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ భయ్యా, కేఎల్ భాయ్.. ‘సేమ్ స్పాట్‌లో అతడికి మళ్లీ బంతి తగిలేలా బౌలింగ్ వెయ్’ అని అరుస్తూనే ఉన్నారు. నేనేమో.. ‘భయ్యా మీరైతే అతడి బౌలింగ్‌లో సులభంగానే ఆడేస్తారు. మరి నా పరిస్థితి ఏమిటి?
అనుకున్నదే జరిగింది
అతడు కూడా నన్ను హెల్మెట్‌పై బంతితో కొడతాడు’ అని మనసులోనే అనుకున్నా. అనుకున్నట్లుగానే రెండో టెస్టులో స్టార్క్ బాల్‌ను నా హెల్మెట్ మీదకు వేశాడు’’ అని బీర్‌బైసెప్స్ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ చాంపియన్‌గా నిలవడంలో స్టార్క్, హర్షిత్‌లు కీలక పాత్ర పోషించారు.
ఇక పెర్త్ టెస్టులో హర్షిత్ రాణా మొత్తంగా నాలుగు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలోని టీమిండియా ఆస్ట్రేలియాను ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయితే, ఐదు మ్యాచ్‌ల బోర్డర్- గావస్కర్ ట్రోఫీని మాత్రం 1-3తో చేజార్చుకుంది.
చదవండి: AUS vs ENG: అతడికి ఇక నిద్రలేని రాత్రులే!.. వార్నర్ ఓ జోకర్!
Mitch Starc offers a little warning to Harshit Rana 😆#AUSvIND pic.twitter.com/KoFFsdNbV2
— cricket.com.au (@cricketcomau) November 23, 2024