Vengsarkar: అశ్విన్‎ను ఎందుకు తీసుకోవడంలేదు.. దీనిపై విచారణ జరిపించాలి

Vengsarkar says Why Ashwin is being dropped for so long is a mystery Vengsarkar - Sakshi

Vengsarkar Comment on Ashwin: టీ20 ప్రపంచకప్‌2021లో భారత‎ తుది జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్‎ను తీసుకోకపోవడంపై మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో వరుసగా టీమిండియా ఓడిపోతున్నప్పటికీ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై విచారణ జరిపించాలని అతడు డిమాండ్‌ చేశాడు.

“అశ్విన్‌ని ఇంత కాలం ఎందుకు తీసుకోవడం లేదు? ఇది విచారణకు సంబంధించిన అంశం. ఫార్మాట్‌లలో అతడు 600 కంటే ఎక్కువ అంతర్జాతీయ వికెట్లు తీసిన  అత్యుత్తమ స్పిన్నర్. అతడు  అనుభవం ఉన్న స్పిన్నర్. అతడిని ఎందుకు తీసుకోవడంలేదో నాకు అర్థం కావడం లేదు. అశ్విన్‌ని ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో కూడా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. అలాంటప్పుడు అతన్ని ఎందుకు సెలక్ట్‌ చేస్తారు? ఇది నాకు ఒక ప్రశ్నగా మిగిలింది" అని  వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు. కాగా ఆదివారం న్యూజిలాండ్‎తో జరిగిన మ్యాచ్‎లో భారత్‌ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్-2 ఐదో స్థానంలో నిలిచిన భారత్ సెమీస్ ఆశలు గల్లంతు చేసుకుంది.

చదవండి: వారిని క్షమించు.. జట్టును కాపాడుకో.. కోహ్లికి బాసటగా నిలిచిన రాహుల్‌ గాంధీ

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top