వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బకు వరల్డ్‌ రికార్డ్స్‌ బ్రేక్‌ | Vaibhav Sooryavanshi Scripts IPL History, Breaks Multiple Records With 36-Ball Hundred | Sakshi
Sakshi News home page

IPL 2026: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బకు వరల్డ్‌ రికార్డ్స్‌ బ్రేక్‌

Apr 25 2026 9:20 PM | Updated on Apr 25 2026 10:46 PM

Vaibhav Sooryavanshi Scripts IPL History, Breaks Multiple Records With 36-Ball Hundred

ఐపీఎల్‌-2026లో జైపూర్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌లనం వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసక‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. వైభవ్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను ఉతికారేశాడు.

గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు సైతం చుక్కలు చూపించాడు. సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు.  ఈ క్రమంలో సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో తన రెండో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

వైభవ్ మొత్తంగా 103 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే మ్యాచ్‌లో తన హాఫ్ సెంచరీని వైభవ్ కేవలం 15 బంతుల్లోనే సాధించాడు. వైభవ్ ఈ ఏడాది సీజన్‌లో హాఫ్ సెంచరీ కేవలం 15 బంతుల్లో పూర్తి చేయడం ఇది మూడోసారి. ఈ క్రమంలో వైభవ్ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.

వైభవ్‌ సాధించిన సంచలన రికార్డులు ఇవే
👉ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. వైభవ్ కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(గేల్ 21 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది.

👉టీ20 ఫార్మాట్‌లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్ వరల్డ్ రికార్డు సాధించాడు.  కేవలం 26 ఇన్నింగ్స్‌ల్లోనే సూర్యవంశీ ఈ రికార్డును అందుకున్నాడు.

👉ఐపీఎల్‌లో 20 ఏళ్ల లోపు వయసులో  5 కంటే ఎక్కువసార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా వైభవ్ నిలిచాడు.

👉ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 15 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా వైభవ్ రికార్డులకెక్కాడు. వైభవ్ మూడు సార్లు ఈ ఘనతను అందుకున్నాడు.

👉అదేవిధంగా ఇది ఐపీఎల్‌లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. తొలి స్ధానంలో క్రిస్ గేల్‌(30) ఉండగా.. సెకెండ్ ప్లేస్‌లో సూర్యవంశీ(35)నే ఉన్నాడు.



 

 

Advertisement
 
Advertisement
Advertisement