వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తెలుగు యోధాస్‌ గెలుపు | Ultimate Kho Kho: Telugu Yoddhas Record Second Straight Victory | Sakshi
Sakshi News home page

Ultimate Kho Kho: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తెలుగు యోధాస్‌ గెలుపు

Aug 17 2022 7:29 AM | Updated on Aug 17 2022 7:29 AM

Ultimate Kho Kho: Telugu Yoddhas Record Second Straight Victory - Sakshi

పుణే: అల్టిమేట్‌ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్‌ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్‌ 68–47 పాయింట్ల తేడాతో రాజస్తాన్‌ వారియర్స్‌ను ఓడించింది. ఆదర్శ్‌ మొహితే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో తెలుగు యోధాస్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆదర్శ్‌ మూడు నిమిషాల 43 సెకన్లు ఫీల్డ్‌లో గడిపి... ఆ తర్వాత 10 పాయింట్లు కూడా స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 54–49తో జగర్‌నట్స్‌ ఒడిషా జట్టుపై గెలిచింది.    
 

Advertisement
 
Advertisement
Advertisement