హెచ్‌సీఏలో కొత్త ట్విస్ట్‌; అపెక్స్‌ కౌన్సిల్‌ను రద్దు చేసిన అంబుడ్స్‌మన్‌

Twist In HCA Ombudsman Shocks By Dissolving Apex Council - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపెక్స్‌ కౌన్సిల్‌ను రద్దు చేస్తున్నట్లు అంబుడ్స్‌మన్‌ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ జరిపేంత వరకు అపెక్స్‌ కౌన్సిల్‌ రద్దు చేస్తున్నట్లుగా అంబుడ్స్‌మన్‌ తెలిపింది. కాగా  ఇటీవలే హెచ్‌సీఏలోని అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

అజహర్‌ ఫిర్యాదును పరిశీలించిన అంబుడ్స్‌మన్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే దీనిపై అపెక్స్ కౌన్సిల్ స్పందిస్తూ అసలు అంబుడ్స్‌మన్‌ నియామకం చెల్లదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబుడ్స్‌మన్‌గా దీపక్ వర్మను అజార్ ఏకపక్షంగా నియమించాడని.. ఆ వ్యక్తి అజహర్‌ చెప్పినట్టే వ్యవహరిస్తాడని పేర్కొంది. కాగా రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అపెక్స్‌ కౌన్సిల్‌ తెలిపింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top