Aus Vs Pak: ఆస్ట్రేలియా టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌ హీరో | Travis Head Returns As Vice-Captain, Australia Playing XI For 1st Test Vs Pakistan - Sakshi
Sakshi News home page

పాక్‌తో తొలి టెస్టు.. తుది జట్టును ప్రకటించిన ఆసీస్‌.. వెటరన్‌ స్పిన్నర్‌ ఎంట్రీ

Published Wed, Dec 13 2023 12:54 PM

Travis Head Returns As Vice Captain Australia Playing XI For 1st Test Vs Pakistan - Sakshi

Australia vs Pakistan, 1st Test: పాకిస్తాన్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించింది. షాన్‌ మసూద్‌ బృందంతో తలపడబోయే జట్టులో వెటరన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌కు చోటిచ్చినట్లు తెలిపింది. కాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు పాకిస్తాన్‌ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది.

కంగారూ వంటి పటిష్ట జట్టుతో పోరుకు సన్నద్ధమయ్యే క్రమంలో ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఎలెవన్‌తో నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ కూడా ఆడింది. కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఇదిలా ఉంటే.. గురువారం (డిసెంబరు 14) నుంచి అసలైన సిరీస్‌ ఆరంభం కానుంది.

వైస్‌ కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌-2023 హీరో
పెర్త్‌లో జరుగనున్న ఈ మ్యాచ్‌కు సంబంధించిన తమ తుది జట్టు ఇదేనంటూ ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ బుధవారం వివరాలు వెల్లడించాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌ హీరో ట్రవిస్‌ హెడ్‌ ఈ మ్యాచ్‌లో తనకు డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు తెలిపాడు.

మర్ఫీకి బైబై.. లియోన్‌ ఇన్‌
మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌తో కలిసి హెడ్‌.. కో-వైస్‌ కెప్టెన్‌గా ఉంటాడని కమిన్స్‌ పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో నాథన్‌ లియోన్‌ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. యువ స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు.

ఇక పాక్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది. అదే విధంగా ఆల్‌రౌండర్‌ స్లాట్‌లో కామెరాన్‌ గ్రీన్‌తో పోటీ పడ్డ మిచెల్‌ మార్ష్‌వైపే మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపడంతో అతడు ఈ మ్యాచ్‌లో భాగం కానున్నాడు. ఇదిలా ఉంటే..  స్టార్‌ బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌ వైస్‌ కెప్టెన్‌ అయినప్పటికీ.. ఒకవేళ కమిన్స్‌ గైర్హాజరైతే ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌కే తొలి ప్రాధాన్యం ఉంటుంది.

పాకిస్తాన్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే:
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్‌ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్‌.

చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్‌

Advertisement
Advertisement