Roger Federer: ఇక సెలవు.. రిటైర్మెంట్‌ ప్రకటించిన టెన్నిస్‌ దిగ్గజం ఫెదరర్‌

Tennis Legend Roger Federer Announces Retirement - Sakshi

Roger Federer Announces Retirement: టెన్నిస్‌ దిగ్గజం, స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ తన ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 41 ఏళ్ల ఫెదరర్‌ ఇవాళ (సెప్టెంబర్‌ 15) ట్విటర్‌ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. పురుషుల టెన్నిస్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫెడెక్స్‌ (ఫెదరర్‌ ముద్దు పేరు).. ట్విటర్‌లో ఫేర్‌వెల్‌ సందేశాన్ని పంపాడు. టెన్నిస్‌ కుటుంబానికి ప్రేమతో రోజర్‌ అనే క్యాప్షన్‌తో ఏవీని షేర్‌ చేశాడు.

లండన్‌లో వచ్చే వారం జరిగే లేవర్‌ కప్‌ తన చివరి ఏటీపీ ఈవెంట్‌ కానుందని స్పష్టం చేశాడు. ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ఆటగాడిగా తన 24 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అండగా నిలిచిన వారందరీ కృతజ్ఞతలు తెలిపాడు. ఆట నుంచి తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (GOAT)గా పిలువబడే ఫెడెక్స్‌ తన కెరీర్‌లో మొత్తం 20  గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించాడు. కెరీర్‌లో 1500కు పైగా మ్యాచ్‌లు ఆడిన అతను.. 310 వారాల పాటు వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌గా కొనసాగాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top