96 ఏళ్ల చరిత్రను రిపీట్‌ చేశారు

Team India Batsmen Broken Worst Record After 96 Years In Pink Test - Sakshi

అడిలైడ్‌ : ఆసీస్‌తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో టీమిండియా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన టీమిండియా టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదు చేయడంతో పాటు మరో చెత్త రికార్డును నమోదు చేసింది.  ఆసీస్‌ పేసర్ల దాటికి  భారత బ్యాట్స్‌మన్‌ అంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో మయాంక్‌ అగర్వాల్‌ 9 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  ఒక ఇన్నింగ్స్‌లో ఒక్క ఆటగాడు కూడా డబుల్‌ డిజిట్‌ దాటకపోవడం 96 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే కావడం విశేషం. (చదవండి : షమీ రిటైర్డ్‌ హర్ట్‌ కాదు.. రిటైర్డ్‌ అవుట్‌)

1924లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా  ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో  దక్షిణాఫ్రికా జట్టు 30 పరుగులకే ఆలౌటైంది. అప్పటి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో హెర్బీ టేలర్‌ 7 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవడం.. మిగతా ఆటగాళ్లు కూడా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. కాగా మ్యచ్‌ విషయానికి వస్తే ఆసీస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా విధించిన 90 పరుగులు టార్గెట్‌ను ఆతిథ్య జట్టు రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. జో బర్స్న్‌ అర్థసెంచరీతో మెరవగా.. వేడ్‌ 33, లబుషేన్‌ 6 పరుగులు చేశారు. కాగా అంతకముందు క్రితం రోజు స్కోరు 9/1తో బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్‌ పేకమేడలా కుప్పకూలింది.(చదవండి : టీమిండియా ఘోర వైఫల్యం.. నెటిజన్ల ట్రోల్స్‌)

ఇక టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోర్లను పరిశీలిస్తే.. 1955లో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన టెస్టులో కివీస్‌ 26 పరుగులకే ఆలౌట్‌ అయి అత్యంత తక్కువస్కోరుకే ఆలౌట్‌ అయిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు మూడుసార్లు అత్యల్పస్కోరును నమోదు చేసింది. 1896,1924,1899లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో 30,30,35 పరుగులకు ఆలౌట్‌ అయింది. 1902లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 36 పరుగులకే ఆలౌట్‌ అయింది. తాజాగా 2020లో అడిలైడ్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో టీమిండియా 36 పరుగులకే ఆలౌట్‌ అయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top