ICC Men's T20 World Cup 2022: Sri Lanka Announce 15-Member Squad For T20 WC - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్‌ పేసర్‌ ఎంట్రీ

Sep 16 2022 7:13 PM | Updated on Sep 19 2022 9:50 AM

T20 World Cup 2022: Srilank announce squad for the tournament - Sakshi

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌-2022కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. కాగా గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన పేసర్లు దుష్మంత చమీరా, లహురు కుమార తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే వారిద్దరూ తమ ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటేనే తుది జట్టులోకి చోటు దక్కే అవకాశం ఉంది.

అదే విధంగా ఆసియాకప్‌లో అదరగొట్టిన పేసర్లు మధుశంక, ప్రమోద్‌ మధుషాన్‌ కూడా ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికయ్యారు. ఇక ఆసియాకప్‌-2022లో అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. కాగా షనక సారథ్యంలోని శ్రీలంక జట్టు టీ20 ప్రపంచకప్‌-2022లో తొలుత క్వాలిఫియింగ్‌ రౌండ్‌లో తలపడనుంది.

టీ20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు:  దసున్ షనక (కెప్టెన్‌), దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్‌సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర (ఫిట్‌నెస్‌కు లోబడి), లహిరు కుమార(ఫిట్‌నెస్‌కు లోబడి) దిల్షన్ మధుశంక, ప్రమోద్ మదుషన్
స్టాండ్‌బై ఆటగాళ్లు:
 అషెన్ బండార, ప్రవీణ్ జయవిక్రమ, దినేష్ చండిమాల్, బినురా ఫెర్నాండో, నువానీడు ఫెర్నాండో


చదవండి: 'అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపికచేయాల్సింది.. బాబర్‌కు సపోర్ట్‌గా ఉండేవాడు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement