T20 WC 2022 Final: 1992 సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందన్నావు కదా బాబర్‌! ఇప్పుడేమంటావు?

T20 WC 2022 Final Pak Vs Eng: Trolls On Babar Azam 1992 Memes - Sakshi

ICC Mens T20 World Cup 2022- Pakistan vs England, Final: ‘‘చరిత్ర పునరావృతం కాబోతోంది.. ట్రోఫీ గెలుస్తాం..’’.. టీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం చేసిన వ్యాఖ్యలు. టాస్‌ సమయంలో అతడు మాట్లాడుతూ.. 1992 నాటి సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందంటూ జోస్యం చెప్పాడు. కానీ.. నాటి ఆ సెంటిమెంట్‌ ఇప్పుడు పాకిస్తాన్‌ జట్టుకు కలిసి రాలేదు. పటిష్టమైన జట్టుగా పేరున్న ఇంగ్లండ్‌ పొట్టి ఫార్మాట్‌లో తమ సత్తా చాటుతూ విశ్వవిజేతగా నిలిచింది.

తద్వారా మూడోసారి ఐసీసీ ట్రోఫీ గెలిచి సగర్వంగా తాజా టోర్నీని ముగించింది. మెల్‌బోర్న్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. అతడి నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు అద్భుతంగా రాణించారు. పాక్‌ను 137 పరుగులకే కట్టడి చేశారు. లక్ష్య ఛేదనలో పాక్‌ బౌలర్లు కాసేపు ఇంగ్లండ్‌ను భయపెట్టినా.. ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ వాళ్ల ఆటలు సాగనివ్వలేదు.

వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే అర్ధ శతకం(52 పరుగులు) సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో 2010 తర్వాత ఇంగ్లండ్‌కు మరోసారి టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ దక్కింది. ఇక 2009లో చాంపియన్‌గా నిలిచిన పాకిస్తాన్‌ మరోసారి కప్‌ అందుకోవాలని భావించగా వాళ్లకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో టాస్‌ సమయంలో బాబర్‌ మాటలను ఉద్దేశించి నెటిజన్లు అతడిని ట్రోల్‌ చేస్తున్నారు.

‘‘సెంటిమెంట్లు నమ్ముకుంటే పనికాదని ఇప్పటికైనా అర్థమైందా? టీమిండియా గురించి మీ వాళ్లు మాట్లాడిన మాటలు ఇప్పుడేమయ్యాయి. అయినా ప్రతిసారి లక్‌ కలిసి రాదు. నెదర్లాండ్స్‌ సౌతాఫ్రికాను ఓడించి ఉండకపోతే అసలు సెమీస్‌ దాకా కూడా వచ్చేవాళ్లు కాదు! ఇకనైనా ప్రగల్భాలు మాని ఆటపై దృష్టి పెట్టండి’’ అంటూ హితవు పలుకుతున్నారు.

నీ బెస్ట్‌ కోహ్లి వరస్ట్‌ కంటే కూడా వేస్ట్‌
కాగా 1992 వన్డే వరల్డ్‌కప్‌ మాదిరే టీ20 ప్రపంచకప్‌ ఎనిమిదో ఎడిషన్‌లోనూ పాక్‌కు పరిస్థితులు అనుకూలంగా కనిపించాయి. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ మాదిరి బాబర్‌ ఆజం కూడా ఐసీసీ ట్రోఫీ గెలుస్తాడంటూ పాక్‌ ఫ్యాన్స్‌ ఆశపడగా.. బట్లర్‌ బృందం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇక ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గానూ బాబర్‌ ఆజం తన స్థాయికి తగ్గట్లు రాణించలేదు. 28 బంతుల్లో 32 పరుగులు చేశాడు.

దీంతో టీమిండియా బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి రికార్డులు బ్రేక్‌ చేస్తున్నాడంటూ ప్రశంసలు అందుకున్న బాబర్‌.. ఈ టోర్నీలో కోహ్లి క్లిక్‌ అయితే, అతడు మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. నిజానికి కోహ్లి వరస్ట్‌ ఇన్నింగ్స్‌ కంటే కూడా బాబర్‌ ఆజం బెస్ట్‌ ఇన్నింగ్స్‌ దారుణంగా ఉంది’’ అంటూ ట్రోలింగ్‌కు దిగారు మరికొంతమంది. 

చదవండి: Chris Jordan: ఒకసారి అంటే పర్లేదు.. రెండోసారి కూడా అదే తప్పు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-11-2022
Nov 13, 2022, 18:56 IST
టీ20 ప్రపంచకప్‌-2022 ట్రోఫీని ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. మెల్‌బోర్న్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో విజయం...
13-11-2022
Nov 13, 2022, 18:01 IST
టీ20 ప్రపంచకప్‌-2022 ఛాంపియన్స్‌గా ఇంగ్లండ్‌ నిలిచింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌ రెండోసారి టీ20 ప్రపంచకప్‌...
13-11-2022
Nov 13, 2022, 17:46 IST
ICC Mens T20 World Cup 2022- Final Pakistan vs England Updates In Telugu: ఐదు వికెట్ల...
13-11-2022
Nov 13, 2022, 17:07 IST
ICC Mens T20 World Cup 2022- Final Pakistan vs England: పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ మరోసారి...
13-11-2022
Nov 13, 2022, 17:01 IST
అంతర్జాతీయ టీ20ల్లో  పాకిస్తాన్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అ‍త్యధిక వికెట్లు పడగొట్టిన పాకిస్తాన్‌...
13-11-2022
Nov 13, 2022, 16:31 IST
సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర ఓటమి పాలైన టీమిండియా.. టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే....
13-11-2022
Nov 13, 2022, 16:15 IST
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ మధ్య ఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌...
13-11-2022
Nov 13, 2022, 15:43 IST
ICC Mens T20 World Cup 2022 - Pakistan vs England, Final: టీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌తో...
13-11-2022
Nov 13, 2022, 15:16 IST
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా ఫైనల్‌ చేరడంలో విఫలమైనప్పటికి...
13-11-2022
Nov 13, 2022, 14:39 IST
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ అరుదైన రికార్డు అందుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లలో ఇంగ్లండ్‌ తరపున అత్యధిక...
13-11-2022
Nov 13, 2022, 13:21 IST
ICC Mens T20 World Cup 2022- Pakistan vs England, Final: ‘‘మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనే అనుకున్నాం. కానీ...
13-11-2022
Nov 13, 2022, 13:18 IST
సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారా.. ఇద్దరు ఇద్దరే. సమకాలీన క్రికెట్‌లో పరుగులు సాధించడంలో పోటీ పడ్డారు. సచిన్‌ రెండు ఫార్మాట్లలో(వన్డే,...
13-11-2022
Nov 13, 2022, 12:24 IST
అది 1992వ సంవత్సరం. పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ మధ్య మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఫైనల్‌ మ్యాచ్‌. ఆ మ్యాచ్‌లో అప్పటి పాక్‌...
13-11-2022
Nov 13, 2022, 10:16 IST
టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌ ఓటమి తర్వాత టీమిండియాపై విమర్శల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. పోరాడి ఓడిపోయుంటే ఇన్ని విమర్శలు...
13-11-2022
Nov 13, 2022, 09:46 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022లో అద్భుత ప్రదర్శనతో విమర్శకులు, ప్రత్యర్ధుల ప్రశంసలు సైతం అందుకున్న టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, మిస్టర్‌ 360 డిగ్రీస్‌...
13-11-2022
Nov 13, 2022, 09:10 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియా దారుణ పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చేసిన వివాదాస్పద...
13-11-2022
Nov 13, 2022, 08:05 IST
టీ20 వరల్డ్‌కప్‌-2022 చివరి అంకానికి చేరుకుంది. మెల్‌బోర్న్‌లో ఇవాళ (నవంబర్‌ 13) ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ జట్లు టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి....
13-11-2022
Nov 13, 2022, 04:44 IST
26 అక్టోబర్, 2022: ఐర్లాండ్‌ చేతిలో అనూహ్యంగా ఓడిన ఇంగ్లండ్‌ 27 అక్టోబర్, 2022: జింబాబ్వే చేతిలో స్వయంకృతంతో ఓడిన పాక్‌ టి20...
12-11-2022
Nov 12, 2022, 22:15 IST
టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో దారుణ పరాజయం అనంతరం టీమిండియా స్వదేశానికి చేరుకుంది. శనివారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన...
12-11-2022
Nov 12, 2022, 19:45 IST
టి20 ప్రపంచకప్‌లో ఆదివారం(నవంబర్‌ 13న) మెల్‌బోర్న్‌ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. మరి పొట్టి ప్రపంచకప్‌లో...



 

Read also in:
Back to Top