PAK vs AUS: ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ అరుదైన ఫీట్‌.. దిగ్గజ ఆటగాళ్ల రికార్డు బద్దలు

Steve Smith Surpasses Kumar Sangakkara-Sachin Tendulkar Test Records - Sakshi

ఆస్ట్రేలియా సీనియర్‌ బ్యాటర్‌ స్టీవ్‌స్మిత్‌ ఒక అరుదైన ఫీట్‌ సాధించాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్‌ 59 పరుగులు చేసి ఔటయ్యాడు. తద్వారా స్మిత్‌ ఒక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో 150వ ఇన్నింగ్స్‌ దగ్గర అత్యధిక పరుగులు(7993 పరుగులు) సాధించిన తొలి బ్యాటర్‌గా స్మిత్‌ నిలిచాడు.

ఈ నేపథ్యంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కరను(7913 పరుగులు) స్మిత్‌ అధిగమించాడు. కాగా స్మిత్‌, సంగక్కర తర్వాత వరుసగా టీమిండియా త్రయం సచిన్‌ టెండూల్కర్‌(7,869 పరుగులు), వీరేంద్ర సెహ్వాగ్‌(7,694 పరుగులు), రాహుల్‌ ద్రవిడ్‌(7,680 పరుగులు) ఉన్నారు.  

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఉస్మాన్‌ ఖవాజా 91, అలెక్స్‌ క్యారీ 67, కామెరాన్‌ గ్రీన్‌ 79, స్మి్‌త్‌ 59 పరుగులు చేశారు. పాకిస్తాన్‌ బౌలర్లలో షాహిన్‌ అఫ్రిది, నసీమ్‌ షా చెరో 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాకిస్తాన్‌ వికెట్‌ నష్టానికి 89 పరుగులు చేసింది. 

చదవండి: IPL 2022: అభిమానులకు బీసీసీఐ బ్యాడ్‌న్యూస్‌.. వరుసగా నాలుగో ఏడాది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top