SA vs NZ: జ‌ట్టును ప్ర‌క‌టించిన దక్షిణాఫ్రికా.. ఏడేళ్ల త‌ర్వాత బౌల‌ర్‌ రీ ఎంట్రీ

South Africa announce 17 Member Squad for New Zealand tour, Simon Harmer earns recall - Sakshi

న్యూజిలాండ్‌తో త్వ‌రలో జ‌ర‌గ‌నున్న టెస్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా 17 మంది సభ్యులతో కూడిన‌ జట్టును బుధ‌వారం ప్ర‌కటించింది. కాగా  స్పిన్న‌ర్‌  సైమన్ హార్మర్ దాదాపు ఏడేళ్ల త‌ర్వాత సౌత్ఆఫ్రికా క్రికెట్ త‌రుపున‌  పున‌రాగామనం చేయ‌నున్నాడు. 2015లో ప్రోటీస్ జట్టుకు హర్మర్ చివరిగా ఆడిన హర్మర్.. దక్షిణాఫ్రికా క్రికెట్‌ను విడిచిపెట్టి, 2017లో ఇంగ్లండ్ కౌంటీ జట్టు ఎసెక్స్‌తో కోల్‌పాక్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కేశవ్ మహారాజ్‌కు బ్యాక్అప్‌గా హర్మర్‌ను సౌత్ఆఫ్రికా క్రికెట్ ఎంపిక చేసింది.

అత‌డి ఫస్ట్-క్లాస్ కేరిర్‌లో 700కి పైగా వికెట్లు ప‌డ‌గొట్టాడు. 2014లో టెస్ట్ క్రికెట్‌లో అరంగ‌ట్రేం చేసిన హర్మర్ 20 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక హర్మర్‌తో పాటు వెస్టిండీస్, భారత్‌తో సిరీస్‌లకు దూరమైన పేసర్ లూథో సిపమ్లా కూడా తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇక  ఈ జ‌ట్టుకు డీన్ ఎల్గ‌ర్ సార‌థ్యం వ‌హించునున్నాడు. కాగా భార‌త్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తేడాతో దక్షిణాఫ్రికా కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.
కోల్‌పాక్ ఒప్పందం అంటే..
యూరోపియ‌న్ యూనియాన్‌తో ఒప్పందం  కుదుర్చుకున్న దేశాలకు  చెందిన ఆటగాళ్లు విదేశీ ఆటగాడిగా పరిగణించకుండా ఈయూ దేశాల్లో  ఏదైనా క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనవచ్చని కోల్‌పాక్ ఒప్పందం పేర్కొంది.

న్యూజిలాండ్ పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా, సారెల్ ఎర్వీ, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, లుంగి ఎన్గిడి, డువాన్ ఒలివియర్, కీగన్ పీటర్సన్, కగిసో రబాడ, రెయాన్ రికిల్‌ట‌న్‌, లూథో సిపమ్లా, గ్లెంటన్ స్టౌర్‌మాన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, కైల్ వెర్రెయిన్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top