Sneh Rana: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ అందుకున్న టీమిండియా ఆల్‌రౌండర్‌

Sneh Rana Jumps To Career-Best Sixth In ICC T20I Bowlers Ranking - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మహిళల టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్‌ స్నేహ్‌ రాణా తన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు టోర్నీ ఫైనల్లో రెండు వికెట్లు పడగొట్టిన స్నేహ్‌ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌లో నిలిచింది. భారత్‌కే చెందిన దీప్తి శర్మ, రేణుక సింగ్‌ ఒక్కో స్థానం పడిపోయి వరుసగా మూడు, ఎనిమిది ర్యాంకుల్లో నిలిచారు. ఇక ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్కిల్‌స్టోన్‌ 763 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికాకు చెందిన నొన్‌కులుకో లాబా 753 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన మూడో స్థానంలో, షఫాలీ వర్మ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక టాప్‌లో ఆస్ట్రేలియాకు చెందిన తాహిలా మెక్‌గ్రాత్‌ 803 పాయింట్లతో కొనసాగుతుంది. టి20 ర్యాంకింగ్స్‌లో తాహిలా 800 పాయింట్లు అందుకోవడం ఇదే తొలిసారి.ఇంతకముందు చార్లెట్‌ ఎడ్‌వర్డ్స్‌ జూన్‌ 2009లో 843 పాయింట్లతో కెరీర్‌ బెస్ట్‌ రేటింగ్‌ పాయింట్లు అందుకుంది.

చదవండి: డబ్ల్యూపీఎల్‌ వేలం.. బరిలో 409 మంది 

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top