
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తుది అంకానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో పర్యాటక టీమిండియా విజయానికి 7 వికెట్ల దూరంలో నిలవగా.. ఆతిథ్య ఇంగ్లండ్ తమ గెలుపునకు 536 పరుగుల దూరంలో ఉంది. 608 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్టోక్స్ సేన నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.
క్రీజులో ఓలీ పోప్(24), హ్యారీ బ్రూక్(15) ఉన్నారు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసి ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి టెస్టు విజయాన్ని అందుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ పంత్‌పై కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సీరియస్ అయ్యాడు. డీఆర్‌ఎస్ విషయంలో కెప్టెన్-వైస్ కెప్టెన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది.
అసలేమి జరిగిందంటే?
సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ తమ అద్బుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్‌డకెట్‌ను ఆరంభంలోనే పెవిలియన్‌కు పంపారు. ఈ క్రమంలో గిల్ మూడో పేసర్ ప్రసిద్ద్ కృష్ణను ఎటాక్‌లో తీసుకొచ్చాడు.
పదో ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ.. మూడో బంతిని జో రూట్‌కు ఫుల్లర్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని డిఫెన్స్ ఆడేందుకు రూట్ ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. దీంతో ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు.
అయితే బంతి లెగ్ సైడ్‌కు వెళ్తున్నట్లగా అన్పించడంతో గిల్ రివ్యూ తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కానీ రిషబ్ పంత్ మాత్రం పట్టుపట్టి మరి రివ్యూకి వెళ్లమని బలవంతం చేశాడు. దీంతో గిల్ ఆఖరి సెకెన్లలో రివ్యూ తీసుకునేందుకు సిగ్నల్ చేశాడు.
రిప్లేలో బంతి స్టంప్స్ మిస్స్ అయ్యి డౌన్‌ది లెగ్ వెళ్తున్నట్లు తేలింది. దీంతో శుబ్‌మన్ కోపంతో పంత్ వద్దకు వెళ్లాడు. పంత్ వెంటనే తను అనుకున్నది కెప్టెన్‌కు వివరించాడు. కానీ గిల్ మాత్రం కోపంగానే పంత్ వైపు చూస్తూ తన ఫీల్డింగ్ స్ధానానికి చేరుకున్నాడు. అయితే ఆ తర్వాతే ఓవర్‌లోనే రూట్‌ను ఆకాష్‌దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే