LLC 2022: ఇండియా మహరాజాస్‌తో మ్యాచ్‌.. సనత్‌ జయసూర్య అవుట్‌! షేన్ వాట్సన్ ఇన్‌

Shane Watson, Daniel Vettori replace Herschelle Gibbs, Sanath Jayasuriya - Sakshi

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌-2022 ఓ ప్రత్యేకమైన మ్యాచ్‌తో ఆరంభం కానుంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఇండియా మహరాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య ఓ చారటీ మ్యాచ్‌ జరగనుంది. సెప్టెంబర్ 16న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇక ఇప్పటికే ఇరు జట్లను ఆయా మేనేజ్‌మెంట్‌లు ప్రకటించాయి. ఇండియా మహరాజాస్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. వరల్డ్‌ జెయింట్స్‌కు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యం వహించనున్నాడు.

అయితే తాజాగా వరల్డ్‌ జెయింట్స్‌ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హర్షల్‌ గిబ్స్‌, శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం సనత్‌ జయసూర్య దూరమయ్యారు. వీరిద్దరి స్థానంలో న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ డానియల్‌ వెటోరి, ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ జట్టులో చేరారు. ఇండియా మహరాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ తర్వాత సెప్టెంబరు 17 నుంచి అసలు పోటీ ఆరంభం కానుంది. లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ సీజన్‌-2లో టైటిల్‌ కోసం నాలుగు జట్లు తలపడబోతున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 15 మ్యాచ్‌లు ఉంటాయి.
ఇండియా మహరాజాస్‌ జట్టు:
సౌరవ్‌ గంగూలీ(కెప్టెన్‌), వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌,యూసఫ్‌ పఠాన్‌, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, పార్థివ్‌ పటేల్‌(వికెట్‌ కీపర్‌), స్టువర్ట్‌ బిన్నీ, ఎస్‌ శ్రీశాంత్‌, హర్భజన్‌ సింగ్‌, నమన్‌ ఓజా(వికెట్‌ కీపర్‌), అక్షశ్‌ దిండా, ప్రజ్ఞాన్‌ ఓజా, అజయ్‌ జడేజా, ఆర్పీ సింగ్‌, జోగీందర్‌ శర్మ, రితేందర్‌ సింగ్‌ సోధి.

వరల్డ్‌ జెయింట్స్‌ జట్టు:
ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), లెండిల్‌ సిమన్స్‌, డానియల్‌ వెటోరి, జాక్వస్‌ కలిస్‌, షేన్ వాట్సన్, మాట్‌ ప్రియర్‌(వికెట్‌ కీపర్‌), నాథన్‌ మెకల్లమ్‌, జాంటీ రోడ్స్‌, ముత్తయ్య మురళీధరన్‌, డేల్‌ స్టెయిన్‌, హోమిల్టన్‌ మసకజ్ద, మష్రాఫ్‌ మోర్తజా, అస్గర్‌ అఫ్గన్‌, మిచెల్‌ జాన్సన్‌, బ్రెట్‌ లీ, కెవిన్‌ ఒ బ్రెయిన్‌, దినేశ్‌ రామ్‌దిన్‌(వికెట్‌ కీపర్‌).
చదవండి: Hundred Tourney: సిక్సర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించిన ప్రొటిస్‌ బ్యాటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top