షకీబుల్‌ హసన్‌కు ఊరట

Shakib Al Hasan ban will be lifted from Thursday - Sakshi

నేటితో ముగియనున్న ఐసీసీ నిషేధం

ఢాకా: బంగ్లాదేశ్‌ క్రికెట్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌కు నేటితో ఊరట దక్కనుంది. అతనిపై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) విధించిన నిషేధం గురువారంతో ముగియనుంది. దీనిపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అతనితో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకునేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు బంగ్లాదేశ్‌ టి20 కెప్టెన్‌ మహ్ముదుల్లా పేర్కొన్నాడు. ప్రస్తుతం 33 ఏళ్ల షకీబ్‌ తన కుటుంబంతో కలిసి అమెరికాలో ఉన్నాడు. బుకీల గురించి బోర్డుకు సరైన సమయంలో సమాచారం ఇవ్వని కారణంగా గతేడాది అక్టోబర్‌ 29న ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్‌ షకీబ్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. రెండు సంవత్సరాలలో ఒక ఏడాది క్రికెట్‌ ఆడకుండా నిషేధం విధించగా... మరో ఏడాదిపాటు సస్పెన్షన్‌ అమలులో ఉంటుందని పేర్కొంది. నేటితో ఏడాది నిషేధం ముగియనుండటంతో దేశవాళీ టోర్నీలతో షకీబ్‌ మళ్లీ క్రికెట్‌ మొదలుపెట్టే చాన్స్‌ ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top