‘ఆఫ్రికా కప్‌’ కోసం సెనెగల్‌ అప్పీల్‌ | Senegal appeal for Africa Cup | Sakshi
Sakshi News home page

‘ఆఫ్రికా కప్‌’ కోసం సెనెగల్‌ అప్పీల్‌

Mar 27 2026 2:46 AM | Updated on Mar 27 2026 2:46 AM

Senegal appeal for Africa Cup

జెనివా: ఆఫ్రికా కప్‌ గెలిచిన మమ్మల్నే తిరిగి విజేతగా ప్రకటించాలని సెనెగల్‌ ఫుట్‌బాల్‌ జట్టు కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఆఫ్‌ స్పోర్ట్‌ (సీఏఎస్‌)లో అప్పీలు చేసింది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆఫ్రికన్‌ ఫుట్‌బాల్‌ (సీఏఎఫ్‌) తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై సెనెగల్‌ సీఏఎస్‌లో సవాల్‌ చేసింది. ఈ అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన సీఏఎస్‌ విచారణ, తుది తీర్పు వెలువరించేందుకు కాలపరిమితి లేదని సెనెగల్‌కు తేల్చిచెప్పింది. దీంతో సెనెగల్‌ కోరుతున్న న్యాయం ఎప్పుడు దక్కుతుందో ఎవరికీ తెలియదన్న మాట! 

ఏం జరిగిందంటే? 
మొరాకో వేదికగా జనవరిలో ఆతిథ్య మొరాకో, సెనెగల్‌ మధ్య ఆఫ్రికా కప్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌ జరిగింది. నిర్ణీత సమయం 0–0తో ముగియగా...‘ఎక్స్‌ట్రా’ టైమ్‌లో మొరాకోకు ఇచ్చిన ‘పెనాల్టీ’ని వ్యతిరేకిస్తూ సెనెగల్‌ నిష్క్రమించింది. తర్జనభర్జన అనంతరం మైదానంలోకి దిగగా... సెనెగల్‌ గోల్‌కీపర్‌ పెనాల్టీని అడ్డుకున్నాడు. 

తర్వాత సెనెగల్‌ గోల్‌ చేసి విజేతగా నిలిచింది. అయితే సెనెగల్‌ మైదానం నిష్క్రమించడంతోనే ఆడే అర్హతను కోల్పోయిందని కాబట్టి తమనే విజేతగా ప్రకటించాలని మొరాకో సీఏఎఫ్‌లో కేసు వేయగా... సీఏఎఫ్‌ మొరాకోకు అనుకూలంగా తీర్పునిచ్చింది.  

Advertisement
 
Advertisement
Advertisement