
PC: Yash Dhull Instagram
Rohit Sharma: బెంగళూరులో హిట్‌మ్యాన్.. వన్డే సిరీస్ నాటికి ఫిట్‌నెస్ సాధించేనా?
Rohit Sharma- Ravindra Jadeja: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ సెంటర్‌కు చేరుకున్నారు. కాగా తొడ కండరాల గాయం తిరగబెట్టడంతో హిట్‌మ్యాన్, ముంజేతి గాయం కారణంగా జడ్డూ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరువురు తిరిగి ఫిట్‌నెస్ సాధించడంపై దృష్టి సారించారు. ఇక వన్డే సిరీస్ నాటికి జట్టుతో చేరే విధంగా రోహిత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా... గాయపడ్డ రోహిత్ శర్మ స్థానంలో సౌరాష్ట్ర క్రికెటర్ ప్రియాంక్ పాంచల్‌ను టెస్టు జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా మూడు టెస్టుల సిరీస్ నిమిత్తం టీమిండియా ఇప్పటికే దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లింది. కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఎలాగైనా సఫారీ గడ్డపై సిరీస్ విజయం సాధించి చరిత్ర తిరగరాయాలని ఉవ్విళ్లూరుతోంది.
మరోవైపు.. మూడు వన్డేలు కూడా ఆడాల్సి ఉండగా ఇంతవరకు బీసీసీఐ జట్టును ప్రకటించలేదు. వన్డే కెప్టెన్సీ తొలగింపు నేపథ్యంలో తాను సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని ఇప్పటికే కోహ్లి స్పష్టం చేయగా... రోహిత్ గనుక సిరీస్ ఆరంభమయ్యే నాటికి కోలుకోనట్లయితే బీసీసీఐ ఎవరిని ఈ సిరీస్‌కు సారథిగా ఎంపిక చేస్తుందా అన్న అంశం చర్చనీయాంశమైంది.
చదవండి: Ind Vs Sa Test Series: కెప్టెన్‌గా కోహ్లికిదే చివరి అవకాశం.. కాబట్టి