
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగి టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి స్వదేశంలో తొలి అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసిన వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ఆటతీరుపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ స్పందించాడు. ‘‘పంత్ ఇది సరిపోదు.. ఇంకా చాలా పరుగులు చేయాలి’’ అని పాంటింగ్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ 2021 షెడ్యూల్ ఖరారవడంతోనే పాంటింగ్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పంత్ ఆడుతుండగా, ఆ జట్టు హెడ్ కోచ్‌గా పాంటింగ్ ఉన్నాడు. ఈ క్రమంలోనే పాంటింగ్ ఇలా కామెంట్ చేశాడు. దానికి పంత్ రిప్లై ఇచ్చాడు. ‘‘హ హ హ హ నీకోసం ఎదురు చూస్తున్నా రిక్’’ అని సమాధానం ఇచ్చాడు. టెస్టు సిరీస్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ప్రదర్శనపై కూడా పాంటింగ్ స్పందించాడు. ‘‘ఇంకా వాళ్ల దగ్గర వికెట్లు మిగిలి ఉన్నాయని అనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న ప్రారంభమై.. మే 30న ముగియనుంది.
చదవండి:
సెహ్వాగ్‌ను చూసినట్లు అనిపించింది: పాక్ మాజీ కెప్టెన్
Rishab Pant: అరె పంత్.. బెయిల్ నీ గ్లోవ్స్‌లోనే ఉంది
Hahhahaha waiting for you Rick
— Rishabh Pant (@RishabhPant17) March 8, 2021