Rashid Khan Dancing For Allu Arjun Pushpa Srivalli Song Step, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Rashid Khan: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన రషీద్ ఖాన్.. అదరగొట్టేశాడుగా!

Feb 1 2022 7:56 AM | Updated on Feb 1 2022 10:24 AM

Rashid Khan imitates famous Allu Arjun hook step with Haris Rauf - Sakshi

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన పుష్ప సినిమా ఫీవ‌ర్ న‌డుస్తోంది. కాగా ఈ సినిమాలో శ్రీవల్లి పాటకు బన్నీ వేసిన స్టెప్ వైరల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా పుష్ప ఫీవ‌ర్ క్రికెట్ ప్ర‌పంచాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన మేనరిజంలతో డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ ఎన్నో స్పూఫ్‌లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్‌లో భాగంగా ఆట‌గాళ్లు వికెట్ ప‌డ‌గొట్టి శ్రీవల్లి పాటకు  డ్యాన్స్ వేస్తూ సెల‌బ్రేష‌న్ జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా ఈ జాబితాలో ఆఫ్ఘాన్ స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌, పాకిస్తాన్ పేస‌ర్‌ హ‌రీష్ రౌఫ్ కూడా చేరారు. వీరిద్ద‌రూ పుష్ప సినిమాలోని శ్రీవల్లి’ పాటకు  డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ర‌షీద్ ఖాన్ ఇన‌స్ట్రాగ‌మ్‌లో  షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ జ‌ట్టుకు వీరిద్ద‌రూ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

చ‌ద‌వండి: IPL 2022 Mega Auction: సన్‌రైజర్స్‌లోకి సురేష్ రైనా.. సురేష్ రైనా.. ధ‌ర ఎంతంటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement