రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ షురూ..!

రెండు నెలల పాటు ఐపీఎల్–15వ సీజన్‌లో అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడిన భారత ఆటగాళ్లు ఇప్పుడు దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ బాట పట్టారు. ఐపీఎల్ టోర్నీకి ముందే లీగ్ దశ మ్యాచ్‌లన్నీ ముగిశాయి. సోమవారం(జూన్ 6) నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు మొదలవుతున్నాయి.
బెంగళూరులో జరిగే తొలి క్వార్టర్స్‌లో బెంగాల్ జట్టుతో జార్ఖండ్ తలపడుతుంది. కాగా... మిగతా మ్యాచ్‌లన్నీ కూడా కర్ణాటకలోని ఆలూర్‌లో జరుగనున్నాయి. ముంబైతో ఉత్తరాఖండ్, కర్ణాటకతో ఉత్తరప్రదేశ్, పంజాబ్‌తో మధ్యప్రదేశ్ తలపడతాయి.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్..!