ఇంగ్లండ్‌దే ఆధిక్యం

 Pope and Woakes edge England ahead of India in fourth Test - Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో 290 ఆలౌట్‌

99 పరుగుల ఆధిక్యం

మెరిసిన పోప్, వోక్స్‌

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 43/0

లండన్‌: నాలుగో టెస్టులో మన పేస్‌ పైచేయి సాధిస్తుందనుకుంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ పట్టుదలే నిలిచింది. తొలి సెషన్‌ మొదట్లో ఉమేశ్‌ యాదవ్‌ (3/76) కసిదీరా బౌలింగ్‌ చేసి... ఇంగ్లండ్‌నూ తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేయొచ్చనే ధీమా కలిగించాడు. కానీ ఒలీ పోప్‌ (81; 6 ఫోర్లు), క్రిస్‌ వోక్స్‌ (50; 11 ఫోర్లు) అర్ధసెంచరీలు టీమిండియా ఆశలపై నీళ్లుచల్లాయి. దీంతో 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ చివరికొచ్చేసరికి అనూహ్యంగా 99 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. మన వశమవుతుందనుకున్న ఆధిక్యం పరాధీనమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 53/3తో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 290 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ వికెట్‌ కోల్పోకుండా 43 పరుగులు చేసింది. ఇంకా 56 పరుగులు వెనుకబడే ఉంది.

స్కోరు వివరాలు: భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 191; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (బి) బుమ్రా 5; హమీద్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 0; మలాన్‌ (సి) రోహిత్‌ (బి) ఉమేశ్‌ 31; రూట్‌ (బి) ఉమేశ్‌ 21; ఒవర్టన్‌ (సి) కోహ్లి (బి) ఉమేశ్‌ 1; పోప్‌ (బి) శార్దుల్‌ 81; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్‌ 37; మొయిన్‌ అలీ (సి) రోహిత్‌ (బి) జడేజా 35; వోక్స్‌ (రనౌట్‌) 50; రాబిన్సన్‌ (బి) జడేజా 5; అండర్సన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (84 ఓవర్లలో ఆలౌట్‌ ) 290. వికెట్ల పతనం: 1–5, 2–6, 3–52, 4–53, 5–62, 6–151, 7–222, 8–250, 9–255, 10–290.
బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 19–2–76–3, బుమ్రా 21–6–67–2, శార్దుల్‌ 15–2–54–1, సిరాజ్‌ 12–4–42–1, జడేజా 17–1–36–2.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బ్యాటింగ్‌) 20; రాహుల్‌ (బ్యాటింగ్‌) 22; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (16 ఓవర్లలో) 43/0.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top