రిషబ్‌ పంత్‌ మిస్‌ చేసుకున్నాడు..

Pant Falls 3 Short Of Century Against Australia - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో  టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా సొగసైన ఇన్నింగ్స్‌ ఆడిన పంత్‌.. మూడు పరుగుల వ్యవధిలో శతకం చేసే చాన్స్‌ను కోల్పోయాడు. నాథన్‌ లయన్‌ వేసిన 80 ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌కు యత్నించిన పంత్‌..కమిన్స్‌కు  క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దాంతో టీమిండియా 250 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు ఓ‍వర్‌నైట్‌ ఆటగాళ్లు రహానే-పుజారాలు చివరిరోజు ఆటను ప్రారంభించారు.  98/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ఆరంభించగా రహానే ఎంతసేపో క్రీజ్‌లో నిలవలేదు. రహానే 18 బంతుల్లో 4 పరుగులు చేసి మూడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన పంత్‌.. దూకుడుగా ఆడాడు. రెండు లైఫ్‌లతో బయటపడ్డ పంత్‌ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఈ క్రమంలోనే హాఫ్‌ సెంచరీ చేసుకున్న పంత్‌.. సెంచరీకి అతి దగ్గరగా వచ్చి పెవిలియన్‌ చేరాడు. 

పుజారా-రిషభ్‌ రికార్డు బ్యాటింగ్‌
పుజారా-రిషభ్‌లు నాల్గో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడి నాల్గో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియా తిరిగి తేరుకుంది. అదే సమయంలో నాల్గో ఇన్నింగ్స్‌లో నాల్గో వికెట్‌కు భారత్‌ తరఫున అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన జోడిగా పుజారా-పంత్‌లు నిలిచారు. గతంలో ఈ రికార్డు రుసి మోడీ-విజయ్‌ హజారేల పేరిట ఉండేది. వీరు నాల్గో ఇన్నింగ్స్‌ నాల్గో వికెట్‌కు 139 పరుగుల్ని సాధించగా, దాన్ని పంత్‌-పుజారాల జోడి బ్రేక్‌ చేసింది. (కెప్టెన్‌తో గొడవ.. టీమ్‌ నుంచి వెళ్లిపోయిన ఆల్‌రౌండర్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top