T20 IND VS PAK: విరాట్‌ వీరోచిత పోరాటం.. ప్రత్యర్ధులు సైతం సలాం కొట్టేందుకు ఆరాటం

Pakistan Ex Player Mohammad Hafeez Praises Virat Kohli - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా పాక్‌తో ఇవాళ (అక్టోబర్‌ 23) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిం‍దే. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ సమరంలో విరాట్‌ కోహ్లి వీరోచితంగా పోరాడి టీమిండియాకు మరపురాని విజయాన్నందించాడు. ఈ నేపథ్యంలో విశ్వం నలుమూలల నుంచి  ఛేజింగ్‌ రారాజుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యర్ధులు సైతం రన్‌ మెషీన్‌కు సలాం కొట్టేందుకు ఆరాటపడుతున్నారు. 

దాయాది పాక్‌ ఆటగాళ్లు, ఆ దేశ మాజీలు సైతం కోహ్లిని పొగడకుండా ఆగలేకున్నారు. పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ హఫీజ్‌ అయితే కింగ్‌ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. వెరీ స్పెషల్‌ ఇన్నింగ్స్‌ బై ఎ వెరీ స్పెషల్‌ ప్లేయర్‌ అంటూ కోహ్లిని ఆకాశానికెత్తాడు. ప్రత్యర్ధి జట్టు ఆటగాడని ఏ మాత్రం ఆలోచించకుండా క్రీడాస్పూర్తిని చాటుతూ కింగ్‌ కోహ్లిని కొనియాడాడు.  హఫీజ్‌ లాగే చాలా మంది ప్రత్యర్ధి జట్ల ఆటగాళ్లు కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో కోహ్లి నామ స్మరణతో సోషల్‌మీడియా హోరెత్తుతుంది. 

ఇక భారత అభిమానులు, ప్రస్తుత, మాజీలు, విశ్లేషకులు విషయానికొస్తే.. వీరు కోహ్లిని అభినందించిన విధానాన్ని మాటల్లో వర్ణించలేము. ముఖ్యంగా భారత అభిమానులైతే కోహ్లిని క్రికెట్‌ దేవుడితో పోలుస్తున్నారు. ఛేజింగ్‌లో కింగ్‌ కోహ్లికి మించిన తోపు లేడని కొనియాడుతున్నారు. క్రికెట్‌ చరిత్రలో కోహ్లి లాంటి ఆటగాడు లేడని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కోహ్లి పుణ్యమా అని చాన్నాళ్ల తర్వాత టీ20 క్రికెట్‌ అసలు మజాను ఆస్వాదించామని, భారతీయులకు దీపావళి ఓ రోజు ముందుగానే వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.    

చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన విరాట్‌ కోహ్లి

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top