ముంబై జట్టు హెడ్‌ కోచ్‌గా ఓంకార్ సాల్వి

Omkar Salvi confirmed as new Mumbai head coach - Sakshi

2023-24 దేశీయ సీజన్‌కు గాను తమ జట్టు ప్రధాన కోచ్‌గా ఓంకార్ సాల్విని ముంబై క్రికెట్ అసోసియేషన్ నియమించింది. ఓంకార్ సాల్వి ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ కోచింగ్‌ స్టాప్‌లో భాగంగా ఉన్నాడు. ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌ ముగిసిన వెంటనే ఓంకార్ ముంబై పురుషుల జట్టుతో చేరనున్నాడు.

కాగా గతంలో ముంబై బౌలింగ్‌ కోచ్‌గా కూడా ఓంకార్ సాల్వి పనిచేశాడు. కానీ ఈ సారి మాత్రం ఆ జట్టు మాజీ హెడ్‌కోచ్‌ అమోల్ ముజుందార్‌ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. అదే విధంగా ముంబై బ్యాటింగ్‌ కోచ్‌గా ఆజట్టు మాజీ ఆటగాడు వినిత్ ఇందుల్కర్ నియమితులు కాగా, మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఓంకార్ గురవ్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించనున్నాడు.

 ముంబై తరపున 16 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన ఓంకార్ గురవ్.. 434 పరుగులు చేశాడు. ఓంకార్ కంటే  వినిత్ ఇందుల్కర్‌కు ఎక్కువ దేశీవాళీ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉంది.  ఇందుల్కర్‌ ముంబై తరపున 43 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 32 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడాడు.
చదవండి: WTC FINAL 2023: కిషన్‌ కంటే అతడు చాలా బెటర్‌.. ఎందుకు సెలక్ట్‌ చేశారో అర్ధం కావడం లేదు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top