నటషా పోస్ట్‌: హార్ధిక్‌ పాండ్యా 2.o

Natasa Stankovic Shares A Video Plays With Her Son Agastya - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యా ఆతడి కాబోయే భార్య, నటి నటసా స్టాంకోవిక్‌ తరచూ వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. గత జులైలో ఈ జంటకు పండంటి మగ బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి వారి కుమారుడు ఆగస్త్యకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్‌ చేస్తుంటూరు ఈ జంట. తాజాగా నటషా తన కుమారుడు ఆగస్త్యతో ఆడుకుంటున్న వీడియోను సోమవారం షేర్‌ చేశారు. ఇందులో ఆగస్త్యతో నటషా మాట్లాడుతూ ఉండే తన ముక్కపై పదే పదే కొడుతున్న వీడియోను రెడ్‌ హర్ట్‌ ఎమోజీ ​క్యాప్షన్‌తో పంచుకున్నారు. (చదవండి: రెండు నెలల అగస్త్యుడు: నటషా)

❤️

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్‌లను తెగ ఆకట్టుకుంటోంది. ‘ఆగస్త్య చాలా ముద్దుగా ఉన్నాడు’,‘హార్ధిక్‌ పాండ్యా 2.o’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్‌ పెడుతున్నారు. నటషా-హార్ధిక్‌ పాండ్యాలు ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ జంటకు జులై 30న ఆగస్త్య జన్మించాడు. ఇటీవల ఆగస్త్యకు రెండు నెలల నిండాయి అంటూ ఈ జంట వారి ముద్దుల తనయుడు ఫొటోలను పోస్టు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: నటాషా,‌ అగస్త్య ఫోటో షేర్‌ చేసిన పాండ్యా)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top