హేడెన్‌కు ఖురాన్‌ను బహుకరించిన రిజ్వాన్‌.. పాక్‌ కోచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Mohammad Rizwan Gifted Holy Quran To Pakistan Coach Hayden, See His Reaction - Sakshi

Mohammad Rizwan Gifts Holy Quran To Matthew Hayden: ఆసీస్‌ లెజెండరీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ పర్యవేక్షనలో పాకిస్థాన్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌-2021లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌ ఇవాళ(నవంబర్‌ 11) రెండో సెమీ ఫైనల్స్‌లో భాగంగా  బలమైన ఆసీస్‌ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో పాక్‌ బ్యాటింగ్‌ కోచ్‌ హేడెన్‌, ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌కు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల కిందట రిజ్వాన్‌, పాక్‌ బ్యాటింగ్‌ కోచ్‌ హేడెన్‌కు పవిత్ర ఖురాన్‌ యొక్క ఇంగ్లీష్‌ వర్షెన్‌ను బహుకరించాడు. ఈ విషయాన్ని హేడెనే స్వయంగా వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను పాక్‌ క్రికెట్‌ జట్టు యొక్క ఆధ్యాత్మిక సంస్కృతికి ఆకర్శితుడినయ్యానని, స్వతాహాగా క్రిస్టియన్‌నే అయినప్పటికీ ఇస్లాం పట్ల ఆసక్తితో ఉన్నానని వ్యాఖ్యానించాడు. రిజ్వాన్‌ తనకు ఇస్లాం విశ్వాసాల  గురించి ఉపదేశిస్తుంటాడని.. అవి తనను బాగా ప్రభావితం చేశాయని.. ఈ క్రమంలో తాను కూడా క్రమం తప్పకుండా ఖురాన్‌ను చదవడం ప్రారంభించానని తెలిపాడు. 

ఈ సందర్భంగా హేడెన్‌ రిజ్వాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రిజ్వాన్‌ అసాధారణమైన బ్యాటర్‌ అని, అంతకుమించి ఛాంపియన్‌ హ్యుమన్‌ అని కొనియాడాడు. రిజ్వాన్‌ తనకు పవిత్ర కానుకను బహుకరించిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా ఇవాళ ఆసీస్‌తో జరగనున్న కీలక సెమీస్‌ సమరంలో రిజ్వాన్‌ ఆడేది లేనిది అనుమానంగా మారింది. గత రెండు రోజులుగా రిజ్వాన్‌ ఫ్లూతో బాధపడుతున్నట్లు పాక్‌ వర్గాల సమాచారం.  
చదవండి: Aus Vs Pak: పాకిస్తాన్‌దే విజయం.. చరిత్రను తిరగరాస్తుంది: టీమిండియా మాజీ క్రికెటర్‌
 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top