వెర్‌స్టాపెన్‌ ఖాతాలో ఎనిమిదో విజయం | Sakshi
Sakshi News home page

వెర్‌స్టాపెన్‌ ఖాతాలో ఎనిమిదో విజయం

Published Mon, Aug 1 2022 5:37 AM

Max Verstappen Secures Eighth Win of Season at Hungarian Grand Prix - Sakshi

ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఎనిమిదో విజయం నమోదు చేశాడు. బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు.

70 ల్యాప్‌ల రేసును వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా గంటా 39 నిమిషాల 35.912 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో... ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన జార్జి రసెల్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానంలో నిలిచారు.

Advertisement
 
Advertisement
 
Advertisement