'ఆ మ్యాచ్‌ ఆడేందుకు త్యాగాలకు కూడా సిద్ధం'

Matthew Wade Says Willing To Make Sacrifices To Play In Brisbane  - Sakshi

సిడ్నీ: టీమిండియాతో నాలుగో టెస్ట్‌ను బ్రిస్బేన్‌లో ఆడ‌టానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఆస్ట్రేలియా వికెట్ కీప‌ర్ మాథ్యూ వేడ్ అన్నాడు. క్వారంటైన్ ఉన్నా కూడా త‌మ‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని.. దీనికోసం కొన్ని త్యాగాల‌కు కూడా తాము సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పాడు. వాస్తవానికి ఆసీస్‌ టీమ్‌కు బ్రిస్బేన్ వేదిక బాగా క‌లిసొచ్చింది‌. ఇక్క‌డ 1988 నుంచి ఆసీస్‌ ఆడిన ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అందుకే ఆ గ్రౌండ్‌లో మ్యాచ్ జరగాలని తాను కోరుకుంటున్న‌ట్లు వేడ్ స్ప‌ష్టం చేశాడు. అక్క‌డ త‌మ రికార్డు బాగుంద‌ని.. త‌మ‌కు ఆ గ్రౌండ్ అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చాడు. అయితే సిడ్నీలోనే రెండు వ‌రుస టెస్టులు ఆడటానికి తాము సిద్ధంగా లేమ‌ని.. షెడ్యూల్ ప్ర‌కార‌మే బ్రిస్బేన్‌లో ఆడ‌టానికే మొగ్గు చూపుతున్నట్లు తెలిపాడు.(చదవండి: టాస్‌ వేశారు.. కాని కాయిన్‌తో కాదు)

క్వీన్స్‌ల్యాండ్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో అక్కడి ప్రభుత్వం క‌ఠిన క్వారంటైన్ నిబంధ‌న‌లను అమలు చేస్తుంది. దీంతో బ్రిస్బేన్‌ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆడడానికి అంగీక‌రించ‌డం లేదు. మరోసారి క్వారంటైన్‌లో ఉండేది లేదని టీమిండియా తేల్చి చెప్పింది. దీంతో నాలుగో టెస్ట్ జ‌రుగుతుందా లేదా అన్న దానిపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే క్రికెట్‌ ఆస్ట్రేలియా మాత్రం  ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుందని తెలిపింది. ఒకవేళ టీమిండియా బ్రిస్బేన్‌లో ఆడడానికి ఒప్పుకోకుంటే సిడ్నీలోనే నాలుగో టెస్టును నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: ‘సింగిల్‌ తీయకపోతే, నీకు ఉంటది’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top