హెడెన్‌ బంపరాఫర్‌ మిస్‌ చేసుకున్న పాక్‌ బౌలర్స్‌ | Matthew Hayden Throw Challenge Naseem Shah-Mohammad Wasim Viral | Sakshi
Sakshi News home page

T20 WC 2022: హెడెన్‌ బంపరాఫర్‌ మిస్‌ చేసుకున్న పాక్‌ బౌలర్స్‌

Oct 20 2022 12:50 PM | Updated on Oct 20 2022 12:54 PM

Matthew Hayden Throw Challenge Naseem Shah-Mohammad Wasim Viral - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌ వార్మప్‌ మ్యాచ్‌ల ద్వారా సరైన ప్రాక్టీస్‌ లభించలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో ఓటమిపాలైన పాకిస్తాన్‌కు రెండో మ్యాచ్‌ వర్షార్పణం అయింది. అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌ అనంతరం వర్షం అంతరాయం కలిగించడం.. ఆపై ఎంతకూ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. వార్మప్‌ మ్యాచ్‌లు ముగియడంతో ఇక పాకిస్తాన్‌ నేరుగా అక్టోబర్‌ 23న(ఆదివారం) మెల్‌బోర్న్‌ వేదికగా టీమిండియాతో తలపడనుంది. 

అయితే టీమిండియాతో పోరుకు ముందు బ్రిస్బేన్‌లో పాక్‌ జట్టు మెంటార్‌.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ త్రో చాలెంజ్‌ కాంపిటీషన్‌ నిర్వహించాడు. త్రో చాలెంజ్‌లో భాగంగా ఎవరైతే బంతిని స్టేడియం బయటకు విసురుతారో వాళ్లకు వంద డాలర్ల ఖరీదైన గిఫ్ట్‌ను ఇస్తానని చాలెంజ్‌ చేశాడు. ఈ చాలెంజ్‌కు పాక్‌ పేసర్లు నసీమ్‌ షా, మహ్మద్‌ వసీమ్‌ జూనియర్‌లు సై అన్నారు.

తాను బంతిని స్టేడియం వెలుపలికి విసరగలనన్న నమ్మకం ఉందని వసీమ్ పేర్కొన్నాడు. అయితే చెప్పినట్లుగా బంతిని బయటకు విసరడంలో మాత్రం విఫలమయ్యాడు. నసీమ్‌ షా కూడా త్రో చాలెంజ్‌లో ఫెయిలయ్యాడు. ఇద్దరు విఫలమవడంతో హేడెన్‌ వంద డాలర్ల గిఫ్ట్‌ను తన వద్దే అట్టిపెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: రాణించిన కుశాల్‌ మెండిస్‌.. భవితవ్యం ఇక బౌలర్ల చేతిలో

స్లో ఓవర్‌ రేట్.. క్రికెట్‌ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement