సీఏదే తప్పు.. గబ్బాలో మొదటి టెస్టు నిర్వహించాల్సింది

Matthew Hayden Blames Cricket Australia Why First Test Not At Gabba - Sakshi

బ్రిస్బేన్‌: 1988 నుంచి 32 ఏళ్ల పాటు బ్రిస్బేన్‌ మైదానంలో ఓటమెరుగని ఆసీస్‌కు టీమిండియా చెక్‌ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే గబ్బాలో జరిగిన నాలుగో టెస్టులో ఆసీస్‌ ఓడిపోవడంపై మాజీ ఆస్ట్రేలియన్‌ ఆటగాళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్లున్నారు. తాజాగా ఆసీస్‌ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియా తీరును తప్పుబడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంప్రదాయం ప్రకారం బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీని గబ్బాలో మొదలుపెట్టుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని.. ఆతిథ్య జట్టుకు 2-1తేడాతో పరాభవం జరిగేదికాదని అభిప్రాయపడ్డాడు. చదవండి: నేరుగా తండ్రి సమాధి వద్దకు సిరాజ్‌

'ప్రతీ ఏడాదిలో సమ్మర్‌ సీజన్‌లో ఆసీస్‌ ఎప్పుడు టెస్టు మ్యాచ్‌ ఆడినా.. గబ్బా వేదికగానే ఆరంభమవుతుంది. కానీ ఈసారి ఆ రూల్‌కు సీఏ వ్యతిరేకంగా వ్యవహరించింది. ఒకవేళ గబ్బాలో మొదటిటెస్టు జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆసీస్‌కు గబ్బా వేదిక బాగా కలిసొచ్చిన మైదానం.. 32 ఏళ్ల పాటు అక్కడ మాకు ఓటమి అనేది తెలియదు. ఇక్కడ తొలి మ్యాచ్‌ జరగుంటే ఆసీస్‌ మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేది. కానీ సీఏ మాత్రం విరుద్ధంగా అడిలైడ్‌ వేదికగా బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌ను అడిలైడ్‌లో ప్రారంభించింది. అంతేగాక టీమిండియా ఎప్పుడు వచ్చినా గబ్బా వేదికగానే తొలి టెస్టు ఆడాల్సి ఉండేది.. దీంతో పాటు పేసర్లకు స్వర్గధామంగా నిలిచే పెర్త్‌(వాకా) మైదానంలో ఈసారి ఒక్క మ్యాచ్‌ కూడా నిర్వహించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ అంశమే నన్ను సీఏను తప్పు పట్టేలా చేసింది.'అంటూ తెలిపాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top