T20 WC 2022: 152 కిమీ వేగం.. 94 మీటర్ల దూరంలో బంతి

Mark Wood Bowls 152 kmph Delivery Glenn Phillips Hits-It-For 94M-Six - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ కొట్టిన సిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అది అంత వైరల్‌గా మారడానికి కారణం మార్క్‌వుడ్‌ వేసిన బంతి వేగం. మార్క్‌వుడ్‌ బంతిని దాదాపు 155 కిమీ వేగంతో విసరగా.. క్రీజులోనే నిలబడిన ఫిలిప్స్‌ లాంగాన్‌ దిశగా భారీ సిక్సర్‌ బాదాడు. మీటర్‌ రీడింగ్‌లో 94 మీటర్ల దూరంగా నమోదయ్యింది. దీనికి సంబంధించిన వీడియోనూ అభిమాని తన ట్విటర్‌లో పంచుకున్నాడు. ''152 ‍ కిమీ వేగం.. 94 మీటర్ల దూరంలో సిక్స్‌ పడింది'' అంటూ కామెంట్‌ చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. బట్లర్‌ సేన న్యూజిలాండ్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొంది, సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌ మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (40), గ్లెన్‌ ఫిలిప్స్‌ (36 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతావారు విఫలం కావడం కివీస్‌ ఓటమికి ప్రధాన కారణం. ఆఖర్లో సాంట్నర్‌ (16 నాటౌట్‌), సోధి (6 నాటౌట్‌) జట్టును గెలిపించేందకు ప్రయత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

చదవండి: సీరియస్‌ మ్యాచ్‌లో ఇంత బిల్డప్‌ అవసరమా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top