ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్ బౌలర్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు గిరి ప్రసాద్‌కు గాయమైంది. న్యూఢిల్లీలో శనివారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టొయినిస్ కొట్టిన షాట్ నెట్స్ వద్ద ఉన్న గిరి ప్రసాద్ ముఖానికి బలంగా తాకింది.
పరామర్శ
ఫలితంగా తీవ్రంగా గాయపడ్డ గిరి ప్రసాద్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేయించింది. ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని గ్రంధి కిరణ్ కుమార్ ఆస్పత్రికి వచ్చి గిరి ప్రసాద్‌ను పరామర్శించారు.
సారీ చెప్పిన స్టొయినిస్
తన షాట్‌తో గాయపడ్డ గిరి ప్రసాద్‌ను పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ స్టొయినిస్ కూడా వచ్చి పరామర్శించాడు. పొరపాటుగా జరిగిన దానికి క్షమించాలని కోరాడు. యువ క్రికెటర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు.
అనంతరం గిరి ప్రసాద్‌తో సెల్ఫీ దిగిన స్టొయినిస్ టోపీపై తన ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాడు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన గిరి ప్రసాద్ గత సీజన్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్ బౌలర్‌గా ఉన్నాడు.
చదవండి: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్‌లో లేకున్నా అందుకే అతడిని పంపించాం


