
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే టెస్టు క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు రోహిత్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించి అందరికి షాకిచ్చాడు. అయితే భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను ముందే తొలిగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా రోహిత్ లాంటి అద్భుతమైన కెప్టెన్ సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రోహిత్‌కు సరైన విడ్కోలు లభించలేదని తివారీ అభిప్రాయపడ్డాడు.
"రోహిత్ శర్మ అద్బుతమైన కెప్టెన్. కెప్టెన్‌గా అతడి ట్రాక్ రికార్డు చాలా బాగుంది. అతడి సారథ్యంలో భారత్ 12 టెస్టుల్లో విజయం, మూడు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా చేర్చాడు. అటువంటి కెప్టెన్‌కు సరైన విడ్కోలు లభించలేదు.
రోహిత్ శర్మ సోషల్ మీడియాలో కాకుండా మైదానంలో మ్యాచ్ ఆడిన తర్వాత రిటైర్ అయి ఉంటే బాగుండేది. అది అతడికి సరైన విడ్కోలు అయి ఉండేది. కానీ రోహిత్ విషయంలో అది జరగలేదని" పరోక్షంగా బీసీసీఐపై తివారీ మండిపడ్డాడు.
రోహిత్ తన టెస్ట్ కెరీర్‌లో 67 మ్యాచ్‌లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్‌గా 24 టెస్టులకు నాయకత్వం వహించి, 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేశాడు.
చదవండి: పాకిస్తాన్‌కు అంత సీన్ లేదు.. త్వరలోనే ఐపీఎల్ మళ్లీ మొదలు: గంగూలీ