భారత్‌తో రెండో టీ20.. శ్రీలంకకు భారీ షాక్‌! | Maheesh Theekshana gets ruled out of T20Is | Sakshi
Sakshi News home page

IND v SL: భారత్‌తో రెండో టీ20.. శ్రీలంకకు భారీ షాక్‌!

Feb 25 2022 8:05 PM | Updated on Feb 25 2022 8:15 PM

Maheesh Theekshana gets ruled out of T20Is - Sakshi

టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఓటమి చెందిన శ్రీలంకకు మరో ఎదరుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్‌ మహేశ్ తీక్షణ గాయం కారణంగా మిగితా రెండు టీ20లకు దూరమయ్యాడు. అదే విధంగా భారత్‌తో సిరీస్‌కు శ్రీలంక స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగా కరోనా బారిన పడి దూరమైన సంగతి తెలిసిందే.కాగా భారత్‌-శ్రీలంక రెండో టీ20 ధర్మశాల వేదికగా ఫిబ్రవరి 26న జరగనుంది.ఇక ఈ మ్యాచ్‌కు స్టార్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్ అందుబాటుపై కూడా సందేహం నెలకొంది. మరోవైపు  శ్రీలంక టెస్టు జట్టులో సభ్యులుగా ఉన్న నిరోషన్ డిక్వెల్లా , ధనంజయ డిసిల్వా  చివరి రెండు మ్యాచ్‌ల కోసం టీ20 జట్టులో చేర్చబడ్డారు.

ఇక తొలి టీ20 విషయానికి వస్తే.. శ్రీలంకపై టీమిండియా 62 పరుగల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఇషాన్‌ కిషన్‌(89), శ్రేయస్‌ అయ్యర్‌(57) సునామీ ఇన్నింగ్స్‌లు ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు సాధించింది. 200 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులకే పరిమితమైంది.

చదవండి: IND vs SL: ''కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు''

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement