బుమ్రాను మర్చిపోండి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అతడే సరైనోడు!

Madan Lal says India will take Umesh Yadav to WTC Final - Sakshi

టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వెన్ను గాయం కారణంగా గత కొన్ని నెలలగా జట్టుకు దూరంగా ఉన్న విషయం విధితమే. అయితే బుమ్రా తన సర్జరీ కోసం త్వరలోనే న్యూజిలాండ్‌కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దాంతో అతడు ఈ ఏడాది సెప్టెంబరు వరకూ ఆటకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌తో పాటు ప్రపంచటెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు కూడా జస్ప్రీత్‌ దూరం కానున్నాడు.

కాగా భారత్‌ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు బుమ్రాను తిరిగి తీసుకురావాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే బుమ్రా న్యూజిలాండ్‌కు వెళ్లనున్నాడు.

ఇక ఇది ఇలా ఉండగా.. బుమ్రాపై భారత మాజీ క్రికెటర్‌ మదన్‌లాల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ప్రస్తుతానికి  బుమ్రా గురించి మరచిపోవాలని, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్‌ అర్హత సాధిస్తే ఉమేష్ యాదవ్‌ను ఇంగ్లండ్‌కు తీసుకువెళ్లాలని మదన్‌లాల్ సూచించాడు.

బుమ్రాను మరచిపోండి..
"ప్రపంచటెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు భారత్‌ అర్హత సాధించే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అందుబాటులో లేని  జస్ప్రీత్‌ బుమ్రా గురించి ఆలోచించకూడదు. అతడిని ఇప్పటికైతే మరచిపోండి. బుమ్రా ఎప్పుడు వస్తాడో అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఏది అందుబాటులో ఉందో దానినే ఉపయోగించుకోవాలి.  

అతడు ఏడాదిన్నర తర్వాత వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడి గాయం చాలా తీవ్రమైనది. కాబట్టి అతడి స్థానంలో ఉమేష్‌ యాదవ్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్‌ జట్టులో స్థానం కల్పించాలి. ఇంగ్లండ్‌ పరిస్ధితులు పేసర్లకు అనూలిస్తాయని మనకు తెలుసు. కాబట్టి ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగాలి. విదేశీ గడ్డపై రాణించే సత్తా ఉమేష్‌కు ఉంది" అని స్పోర్ట్స్‌ టాక్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో మదన్‌లాల్ పేర్కొన్నాడు.
చదవండి: MS Dhoni: ప్రాక్టీసు మొదలెట్టిన ధోని.. షాట్లతో అలరిస్తూ! వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top