టర్కిష్‌ గ్రాండ్‌ప్రి పోల్‌ హామిల్టన్‌దే  | Lewis Hamilton Takes Pole Position For Turkish Grand Prix | Sakshi
Sakshi News home page

టర్కిష్‌ గ్రాండ్‌ప్రి పోల్‌ హామిల్టన్‌దే 

Oct 10 2021 10:20 AM | Updated on Oct 10 2021 10:21 AM

Lewis Hamilton Takes Pole Position For Turkish Grand Prix - Sakshi

Lewis Hamilton.. ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన టర్కిష్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌లో మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ పోల్‌ పొజిషన్‌తో మెరిశాడు. క్వాలిఫయింగ్‌ చివరి సెషన్‌లో అతడు ల్యాప్‌ను అందరి కంటే ముందుగా నిమిషం 22.868 సెకన్లలో పూర్తి చేసి పోల్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా సీజన్‌లో నాలుగో ఇంజిన్‌ను తీసుకున్న హామిల్టన్‌కు 10 స్థానాల గ్రిడ్‌ పెనాల్టీ పడింది. దాంతో అతడు ఆదివారం జరిగే ప్రధాన రేసును 11వ స్థానం నుంచి ఆరంభిస్తాడు. రెండో స్థానంలో నిలిచిన బొటాస్‌ (మెర్సిడెస్‌) తొలి స్థానం నుంచి రేసును ఆరంభించనున్నాడు. ప్రధాన రేసు సాయంత్రం గం. 5.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌ సెలెక్ట్‌ హెచ్‌డి–2లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. 

భారత్‌ ఖాతాలో 30 పతకాలు 
లిమా (పెరూ): ప్రపంచ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌íÙప్‌లో భారత్‌ ‘టాప్‌’లేపింది. టోర్నీలో ఏకంగా 13 స్వర్ణాలు, 11 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 30 పతకాలు సాధించిన భారత్‌ పతకాల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. 20 (6 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో) పతకాలు గెలిచిన అమెరికాకు రెండో స్థానం దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement