విజేత శశికిరణ్‌ | Krishnan Sasikiran wins Fagerness Open International Chess Tournament | Sakshi
Sakshi News home page

విజేత శశికిరణ్‌

Apr 18 2022 6:19 AM | Updated on Apr 18 2022 6:19 AM

Krishnan Sasikiran wins Fagerness Open International Chess Tournament - Sakshi

చెన్నై: ఫాగర్నెస్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ కృష్ణన్‌ శశికిరణ్‌ విజేతగా నిలిచాడు. నార్వేలో ముగిసిన ఈ టోర్నీలో శశికిరణ్‌ నిర్ణీత 9 రౌండ్ల తర్వాత 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ఆర్యన్‌ చోప్రా కూడా 7 పాయింట్లు సాధించినా మెరుగైన టైబ్రేక్‌ స్కోరుతో శశికిరణ్‌కు టైటిల్‌ దక్కింది. ఆర్యన్‌ చోప్రాకు రెండో ర్యాంక్‌ లభించింది. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌ 6.5 పాయింట్లతో 5వ ర్యాంక్‌లో నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement