టీ20 మ్యాచ్‌లో బ్యాటర్ల ఊచకోత.. ఏకంగా 412 పరుగులు! | Joburg Super Kings beat Durban Super Giants by 7 wickets | Sakshi
Sakshi News home page

SA20 2024: టీ20 మ్యాచ్‌లో బ్యాటర్ల ఊచకోత.. ఏకంగా 412 పరుగులు!

Feb 4 2024 11:53 AM | Updated on Feb 4 2024 12:30 PM

Joburg Super Kings beat Durban Super Giants by 7 wickets - Sakshi

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో జో బర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సూపర్‌ కింగ్స్‌.. ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది.ఈ మ్యాచ్‌లో రెండు జ‌ట్లు క‌లిపి ఏకంగా 412 పరుగులు చేశాయి.

ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 20 సిక్స్‌లు బాదారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూపర్‌ జెయింట్స్‌ బ్యాటర్లలో జేజే స్మట్స్‌(55), ముల్దర్‌(59) హాఫ్‌ సెంచరీలతో సత్తచాటగా.. ఆఖరిలో క్లాసెన్‌(16 బంతుల్లో 40, 3 సిక్స్‌లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు.

అనంతరం 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌ కింగ్స్‌ 19.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది.  సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ డుప్లెసిస్‌(29 బంతుల్లో 57), లూస్‌ డిప్లై(57) హాఫ్‌ సెంచరీతో సత్తాచాటారు. వీరిద్దరితో పాటు మడ్సన్‌(44 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లలో నూర్‌ ఆహ్మద్‌ రెండు, ప్రిటోరియస్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement