చెలరేగిన ముకేశ్‌, ఉమ్రాన్‌, కుల్దీప్‌ సేన్‌.. 98 పరుగులకే సౌరాష్ట్ర ఆలౌట్‌ | Sakshi
Sakshi News home page

Irani Cup 2022: కుప్పకూలిన సౌరాష్ట్ర టాపార్డర్‌.. 0,4,0,1,2... 98 పరుగులకే ఆలౌట్‌

Published Sat, Oct 1 2022 1:07 PM

Irani Cup 2022 SAUR Vs ROI: Pujara Fails Saurashtra All Out For 98 - Sakshi

Irani Cup 2022 - Saurashtra vs Rest of India: ఇరానీ కప్‌-2022 టోర్నీలో భాగంగా సౌరాష్ట్ర- రెస్టాఫ్‌ ఇండియా మధ్య టెస్టు మ్యాచ్‌ ఆరంభమైంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా శనివారం ఆట మొదలైంది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రెస్టాఫ్‌ ఇండియాకు బౌలర్లు శుభారంభం అందించారు.

కుప్పకూలిన టాపార్డర్‌
రెస్టాఫ్‌ ఇండియా బౌలర్ల ధాటికి సౌరాష్ట్ర టాపార్డర్‌ కకావికలమైంది. 0,4,0,1,2.. ఇలా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనం సాగింది. ఛతేశ్వర్‌ పుజారా(1) సహా మిగిలిన బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితయ్యారు. ఇక ఆరో స్థానంలో వచ్చిన అర్పిత్‌ వసవాడ 22 పరుగులు, తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధర్మేంద్ర సిన్హ్‌ జడేజా 28 పరుగులతో రాణించారు. 

98 పరుగులకే ఆలౌట్‌
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 24.5 ఓవర్లలో 98 పరుగులకే సౌరాష్ట్ర ఆలౌట్‌ అయింది. రెస్టాఫ్‌ ఇండియా బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 10 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక  కుల్దీప్‌ సేన్‌ మూడు, ఉమ్రాన్‌ మాలిక్‌ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. 

కాగా రంజీ ట్రోఫీ 2019- 20 విజేత సౌరాష్ట్రతో పోరులో వివిధ రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లతో కూడిన రెస్టాఫ్‌ ఇండియాకు తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక సౌరాష్ట్ర జట్టుకు సారథి జయదేవ్‌ ఉనద్కట్‌.

చదవండి: Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్‌ ఖాన్‌ దొరికేశాడు: పాక్‌ మాజీ క్రికెటర్‌
T20 WC 2022: ఆస్ట్రేలియాకు సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌!

Advertisement
 
Advertisement