ఐపీఎల్ 2026లో సీఎస్‌కే జట్టు హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వరుసగా రెండో విజయం సాధించింది. నిన్న (ఏప్రిల్ 14) కేకేఆర్‌పై 32 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ గెలుపు తర్వాత సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చాలా ఆనందంగా కనిపించాడు. ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ గెలుపుపై విశ్లేషణ ఇచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్‌పై సంతృప్తి వ్యక్తపరుస్తూ, ఫీల్డింగ్‌లో లోపాలను ఒప్పుకున్నాడు. రుతురాజ్ మాటల్లో..
పిచ్ మారిపోయింది
మేము 220–210 పరుగులు చేయాలని అనుకున్నాం. కానీ పిచ్ 7–8 ఓవర్ల తర్వాత మారిపోయింది. బంతి స్లో అయ్యి, స్పిన్‌కు అనుకూలించింది. అందుకే 190–180 పరుగులు సరిపోతాయని భావించాం. ఆ తర్వాత పవర్‌ప్లేలో బౌలింగ్ బాగుంటే, రన్‌రేట్ కంట్రోల్ చేయవచ్చని అనుకున్నాం.
మ్యాచ్‌మ్యాచ్‌కు మెరుగవుతున్నారు
మా బౌలర్లు తమ పాత్రలను అర్థం చేసుకుంటున్నారు. ఏ ఓవర్లలో ఏ లెంగ్త్ వేయాలో తెలుసుకుంటున్నారు. మ్యాచ్‌మ్యాచ్‌కు మెరుగవుతున్నారు. ఇది మంచి సంకేతం. నూర్ అహ్మద్, అకీల్ హొసేన్ బౌలింగ్ వ్యూహం చాలా బాగుంది. వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు.
ఫీల్డింగ్‌లో లోపాలు
మేము చాలా క్యాచ్‌లు డ్రాప్ చేశాం. వాతవరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరిగింది. అలాగని ఇది ఆమోదయోగ్యం కాదు. ఈ విషయంలో చాలా మెరుగుపరచుకోవాలి. శక్తి, సంకల్పం, గెలవాలన్న పట్టుదల ఉంటే, కొన్ని డ్రాప్‌లు జరిగినా పర్వాలేదు.
భారీ ఇన్నింగ్స్ దగ్గరలో ఉంది
చాలా రోజుల తర్వాత గెలిచిన జట్టులో ఉండటం ఆనందంగా ఉంది. గత మ్యాచ్ తర్వాత రిలాక్స్‌గా అనిపించింది. ఇప్పుడు పాజిటివ్‌గా ఉన్నాను. భారీ ఇన్నింగ్స్ దగ్గరలోనే ఉంది.
రుతురాజ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. రెండు వరుస విజయాల తర్వాత రిలాక్డ్స్‌గా కనిపించాడు. ప్లస్‌లు, మైనస్‌ల గురించి బహిరంగంగా మాట్లాడాడు. త్వరలో అతని నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందని విశ్వాసంగా ఉన్నాడు.
సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ సొంత ఇలాకా హైదరాబాద్‌లో జరుగునుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని సీఎస్‌కే పట్టుదలగా ఉంది.
నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే.. సంజూ శాంసన్ (48), డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
అనంతరం బరిలోకి దిగిన కేకేఆర్ నూర్ అహ్మద్ (4-0-21-3), అన్షుల్ కంబోజ్ (4-0-32-2), అకీల్ హొసేన్ (4-0-26-1) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేసిన రమన్‌దీప్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


