ఐపీఎల్ 2026లో భాగంగా రేపు (ఏప్రిల్ 2) సన్‌రైజర్స్‌తో జరుగబోయే మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌కు గుడ్ న్యూస్ అందుతుంది. ఆ జట్టు అత్యంత ఖరీదైన ఆటగాడు కెమరూన్ గ్రీన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు.
Cameron Green has resumed bowling in nets. pic.twitter.com/YaJJPHKyky
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2026
గ్రీన్‌ను కేకేఆర్ యాజమాన్యం ఆల్‌రౌండర్ కోటా రూ. 25 కోట్ల భారీ మొత్తం వచ్చించి కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తాడని తెలిసి కేకేఆర్ అభిమానులు చాలా ఫీలయ్యారు. అంత భారీ మొత్తం వెచ్చించి కేవలం బ్యాటింగ్ మాత్రమే ఏంటని బహిరంగ విమర్శలు చేశారు.
గత మ్యాచ్‌లో (ముంబై ఇండియన్స్) గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం కేకేఆర్‌ను మ్యాచ్ కోల్పోయేలా చేసిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్ తర్వాత గ్రీన్ జాతీయ జట్టు క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా ముందుకొచ్చి అతనికి మద్దతుగా నిలబడింది.
గ్రీన్‌కు శస్త్రచికిత్స జరిగింది. అతను మరికొంతకాలం కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతాడని సర్ద చెప్పే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యానికి ముందే చెప్పామని వివరణ ఇచ్చింది. మరో 10-12 రోజుల్లో గ్రీన్ బౌలింగ్ ప్రారంభిస్తాడని ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, ఈ ప్రకటన వెలువడని రెండు రోజుల్లోనే గ్రీన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇది ఒక రకంగా కేకేఆర్‌కు శుభవార్తే అయినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆస్ట్రేలియాకు ఇబ్బందికరమైన విషయం.
గ్రీన్ హడావుడిగా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టడానికి కేకేఆర్ యాజమాన్యం ఒత్తిడి కారణమని తెలుస్తుంది. వారు కూడా ఈ విషయంలో తమ అభిమానుల డిమాండ్ల ముందు తలొగ్గాల్సి వచ్చింది.
గ్రీన్ బౌలింగ్ విషయమై కేకేఆర్ అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసేందుకు వారు ససేమిరా అంటున్నారు. ఆటగాళ్ల విషయం ఫ్రాంచైజీ వ్యక్తిగతమే అయినా, ఇలాంటి విషయాల్లో అభిమానుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారు కూడా జట్టు గెలుపు కోసమే తహతహలాడుతుంటారు కాబట్టి, ఆటగాళ్లపై ఒత్తిడి తప్పదు.
ఏదిఏమైనా గ్రీన్ బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించడం కేకేఆర్‌కు శుభపరిణామం. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 220 పరుగుల భారీ స్కోర్ చేసి కూడా సరైన బౌలింగ్ వనరులు లేకపోవడం చేత దాన్ని కాపాడుకోలేకపోయింది. రేపటి సన్‌రైజర్స్ మ్యాచ్‌లో గ్రీన్ బౌలింగ్ చేస్తే, ఆ జట్టు విజయావకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది.


