IPL 2023 Mini Auction: సన్‌రైజర్స్‌లోకి బెన్‌ స్టోక్స్‌.. కెప్టెన్‌ కూడా అతడే..?

IPL 2023: SRH May Hold Ben Stokes In Mini Auction Says Reports - Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌ మినీ వేలానికి (డిసెంబర్‌ 23) రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. కొత్తగా వేలం బరిలో నిలిచే విదేశీ స్టార్‌ ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీలు చేజిక్కించుకుంటాయోనన్న టెన్షన్‌ అభిమానుల్లో మొదలైంది. పలానా ఆటగాడిని పలానా ఫ్రాంచైజీ దక్కించుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్‌ ఇప్పటినుంచే అంచనాల్లో మునిగితేలుతున్నారు. వేలానికి ఇంకా నెల రోజుల సమయం ఉనప్పటికీ.. తమతమ ఫేవరెట్‌ జట్లు ఇలా ఉంటే బాగుంటుందని లెక్కలేసుకుంటున్నారు. 

ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్‌-2022 స్టార్లు సామ్‌ కర్రన్‌, బెన్‌ స్టోక్స్‌, అలెక్స్‌ హేల్స్‌, ఆదిల్‌ రషీద్‌, సికందర్‌ రాజా, కెమరూన్‌ గ్రీన్‌ తమతమ జట్లలో ఉండాలని అన్ని ఫ్రాంచైజీలు, సంబంధిత జట్ల అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయా ఫ్రాంచైజీల పర్స్‌ల్లో ఉన్న బ్యాలెన్స్‌ లెక్కలను బేరీజు వేసుకుని పై పేర్కొన్న ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే, 10 ఫ్రాంచైజీల్లో ఎక్కువ పర్స్‌ బ్యాలెన్స్‌ ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (42.25 కోట్లు)కు ఎక్కువ మంది స్టార్‌ ఆటగాళ్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఎస్‌ఆర్‌హెచ్‌ దగ్గర ఉన్న బ్యాలెన్స్‌ ప్రకారం.. బెన్‌ స్టోక్స్‌, అలెక్స్‌ హేల్స్‌, కెమరూన్‌ గ్రీన్‌లను చేజిక్కించుకునేందుకు ఎందాకైనా వెళ్లే ఛాన్స్‌ ఉంది. వీరిలో స్టోక్స్‌కు 10 నుంచి 12 కోట్లు ఖర్చు చేసినా.. హేల్స్‌కు 3 నుంచి 4 కోట్లు, గ్రీన్‌కు 6 నుంచి 8 కోట్లు వెచ్చించినా ఆ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా బ్యాలెన్స్‌ మిగిలే ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం సన్‌రైజర్స్‌.. స్టోక్స్‌పై ఎంతైనా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అందులోనూ ఆ జట్టు.. మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను వదిలించుకోవడంతో స్టోక్స్‌ను ఎలాగైనా దక్కించుకుని,  కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పజెప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్:
ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కో జన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టి నటరాజన్, ఫజల్ హక్‌ ఫారూఖీ.

సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్లు:
కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్

ప్రస్తుతానికి ఆయా ఫ్రాంచైజీల పర్స్‌లో ఉన్న బ్యాలెన్స్‌ వివరాలు..
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 42.25 కోట్లు
పంజాబ్‌ కింగ్స్‌-32.20 కోట్లు
లక్నో సూపర్‌ జెయింట్స్‌-23.35 కోట్లు
ముంబై ఇండియన్స్‌-20.55 కోట్లు
చెన్నై సూపర్‌కింగ్స్‌-20.45కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్‌-19.45 కోట్లు
గుజరాత్‌ టైటాన్స్‌-19.25 కోట్లు
రాజస్థాన్‌ రాయల్స్‌-13.20 కోట్లు
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు-8.75 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌-7.05 కోట్లు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top