IPL 2022 Sunrisers Team Special Wishes To ISL Winner Hyderabad FC, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2022- SRH: ఇంటికి వస్తోంది.. ట్రోఫీ.. కంగ్రాట్స్‌: సన్‌రైజర్స్‌

Mar 21 2022 12:04 PM | Updated on Mar 23 2022 6:38 PM

IPL 2022: Sunrisers Wishes ISL Winner Hyderabad FC Intiki Vastondi Cup - Sakshi

IPL 2022- SRH: ఇంటికి వస్తోంది.. ట్రోఫీ.. కంగ్రాట్స్‌: సన్‌రైజర్స్‌

ISL -IPL- Hyderabad: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీలో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) విజేతగా నిలిచింది. ఎనిమిదో సీజన్‌ చాంపియన్‌గా నిలిచింది. గోవాలో మార్చి 20న జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించి టైటిల్‌ గెలుచుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ‘షూటౌట్‌’ నిర్వహించగా కేరళను నిలువరించి విజయం సాధించింది. కాగా ఐఎస్‌ఎల్‌ ట్రోఫీని హైదరాబాద్‌ గెలవడం ఇదే తొలిసారి. 

ఈ విజయంపై స్పందించిన ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐఎస్‌ఎల్‌ విజేతకు తమదైన శైలిలో విషెస్‌ తెలిపింది. మ్యాచ్‌కు సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ.. ‘‘ఇంటికి వస్తోంది ట్రోఫీ.. కంగ్రాట్స్’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా అభినందించింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు కేన్‌ మామ కూడా కప్‌ తీసుకువస్తాడు చూడండి అంటూ ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.

కాగా సన్‌రైజర్స్‌ 2016లో ఐపీఎల్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో మాత్రం ఘోర ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఈసారైనా సత్తా చాటి తమను తాము నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలోని హైదరాబాద్‌ ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోలను షేర్‌ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటోంది.

చదవండి: IPL 2022: షాట్లతో అలరించిన రిషభ్‌ పంత్‌.. రెప్పవాల్చని యువ ఆటగాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement