Tilak Varma: తిలక్‌ నువ్వు ఇలా కూడా చేస్తావా? పాపం బేబీ ఏబీడీ! వీడియో వైరల్‌

IPL 2022: MI Tilak Varma Hilarious Prank On Tim David Dewald Brevis Viral - Sakshi

IPL 2022- Mumbai Indians- Tilak Varma: ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియన్స్‌ పరిస్థితి ఎలా ఉన్నా ఆ జట్టు ఆటగాడు తిలక్‌ వర్మ అదరగొడుతున్నాడు. తాజా ఎడిషన్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగు కుర్రాడు ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 307 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. 

ఇక ఆట విషయాన్ని పక్కన పెడితే.. సహచర ఆటగాళ్లతో ఇట్టే కలిసిపోయే స్వభావం తిలక్‌ వర్మది. ముంబై ఇండియన్స్‌ జట్టులోని యువ ఆటగాళ్లు ముఖ్యంగా దక్షిణాఫ్రికా సంచలనం, జూనియర్‌ ఏబీడీగా పేరొందిన డెవాల్డ్‌ బ్రెవిస్‌తో తిలక్‌కు స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి సరదాగా గడిపిన క్షణాలను ఫ్రాంఛైజీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది.

తాజాగా తిలక్‌కు సంబంధించిన ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇందులో ‘పేస్ట్‌ బిస్కట్‌’తో బ్రెవిస్‌, రిలే మెరెడిత్‌, టిమ్‌ డేవిడ్‌ను ఆటపట్టించాడు. అసలేం జరిగిందంటే.. ముందుగా బిస్కట్లలో క్రీమ్‌ తీసేసిన తిలక్‌ వర్మ.. దానికి బదులు అందులో పేస్ట్‌ను పూశాడు. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే వాటిని ప్యాక్‌ చేసి.. మెల్లగా సహచర ఆటగాళ్ల దగ్గరికి వెళ్లాడు. తన చేతిలోని బిస్కట్లు తినమంటూ వారికి ఆఫర్‌ చేశాడు.

పాపం తిలక్‌ ‘స్కెచ్‌’ గురించి తెలియని డేవిడ్‌, బ్రెవిస్‌, మెరెడిత్‌ ఎంచక్కా వాటిని లాగించేశారు. రుచి కాస్త భిన్నంగా ఉన్నా పర్లేదులే అనుకుంటూ తినేశారు.  అయితే, ఆఖర్లో అసలు విషయాన్ని బయటపెట్టాడు క్రేజీ తిలక్‌. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. పర్లేదు ఇది మింట్‌ ఫ్లేవర్‌ బిస్కట్‌ అనుకున్నా. ఏదమైనా దంతాలకు ఇది మంచిదేగా అంటూ డేవిడ్‌, మెరెడిత్‌ నవ్వుతూ వ్యాఖ్యానించడం విశేషం.

ఈ ప్రాంక్‌ వీడియోను ముంబై తమ సోషల్‌ మీడియా అకౌంట్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. ఇందుక స్పందించిన నెటిజన్లు.. ‘‘వామ్మో తిలక్‌ నీలో ఈ యాంగిల్‌ కూడా ఉందా! ఏదేమైనా మీ మధ్య అనుబంధం.. ముఖ్యంగా బ్రెవిస్‌తో నీ స్నేహబంధం ముచ్చటగొలుపుతోంది’’అని కామెంట్లు చేస్తున్నారు. కాగా అండర్‌-19 భారత జట్టులో సభ్యుడైన తిలక్‌ వర్మను ముంబై మెగా వేలం-2022లో 1.7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. తద్వారా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అతడికి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం లభించింది.

చదవండి👉🏾 Sanju Samson: ఆరోజు పిచ్చిపట్టినట్లయింది.. బ్యాట్‌ విసిరేసి వెళ్లిపోయా.. రాత్రి వచ్చి చూస్తే

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

27-05-2022
May 27, 2022, 12:29 IST
IPL 2022 Qualifier 2 RR Vs RCB: మరోసారి విజేతగా నిలవాలనే కసితో రాజస్తాన్‌ రాయల్స్‌... కనీసం ఈసారైనా టైటిల్‌...
27-05-2022
May 27, 2022, 11:41 IST
పాపం ధావన్‌... తన తప్పు లేకున్నా తన్నులు తిన్నాడు! వైరల్‌ వీడియో
27-05-2022
May 27, 2022, 09:58 IST
 చాన్స్‌ ఇస్తే... చెలరేగిపోవడమే... ఒకరు ఏకంగా టీమిండియలో.. మరొకరు!
27-05-2022
May 27, 2022, 05:59 IST
అహ్మదాబాద్‌: ఐపీఎల్‌–2022 విజేతను తేల్చే తుది పోరుకు ముందు మరో సమరం...ఆదివారం జరిగే ఫైనకు అర్హత సాధించేదెవరో తేల్చే క్రమంలో ...
26-05-2022
May 26, 2022, 19:15 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ తొలి సీజన్‌లోనే అదరగొట్టే ప్రదర్శన నమోదు...
26-05-2022
May 26, 2022, 18:12 IST
ఐపీఎల్‌ 2022లో భాగంగా బుధవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. కాగా...
26-05-2022
May 26, 2022, 17:12 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ క్వాలిఫయర్‌-2కు చేరుకున్న సంగతి తెలిసిందే. బుధవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో...
26-05-2022
May 26, 2022, 16:25 IST
మ్యాచ్‌ సీరియస్‌గా జరుగుతున్న సమయంలో తన ఫెవరెట్‌ ఆటగాడిని దగ్గరి నుంచి చూడాలనే కోరిక చాలా మంది ఫ్యాన్స్‌లో ఉంటుంది....
26-05-2022
May 26, 2022, 16:00 IST
IPL 2022 LSG Vs RCB: ఎలిమినేటర్‌ గండాన్ని అధిగమించి ఐపీఎల్‌-2022 క్వాలిఫైయర్‌-2కు చేరుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు...
26-05-2022
May 26, 2022, 13:27 IST
IPL 2022 LSG Vs RCB: ‘‘ఈ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, పంజాబ్‌ కింగ్స్‌కు మంచి జట్లు దొరికాయి....
26-05-2022
May 26, 2022, 13:16 IST
IPL 2022 Eliminator LSG Vs RCB: ఐపీఎల్‌-2022లో కొత్త జట్టుగా ఎంట్రీ ఇచ్చిన కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలోని లక్నో...
26-05-2022
May 26, 2022, 12:19 IST
రజత్‌ పాటిదార్‌పై కోహ్లి ప్రశంసల జల్లు.. ఏమన్నాడంటే!
26-05-2022
May 26, 2022, 11:48 IST
IPL 2022 LSG Vs RCB- Rajat Patidar: ఐపీఎల్‌-2022లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌తో జరిగిన...
26-05-2022
May 26, 2022, 11:25 IST
IPL 2022 Eliminator LSG Vs RCB: ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే ప్లే ఆఫ్స్‌ చేరిన లక్నో సూపర్‌...
26-05-2022
May 26, 2022, 09:26 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా బుధవారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో 14 పరుగుల తేడాతో లక్నో...
26-05-2022
May 26, 2022, 07:43 IST
ఐపీఎల్‌ లో లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత సాధించాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600...
26-05-2022
May 26, 2022, 05:43 IST
రజత్‌ పటిదార్‌ బెంగళూరుకు బంగారంలా మారాడు. ఐపీఎల్‌ వేలంలో ఎవరూ తీసుకోకపోగా, రెండు లీగ్‌ మ్యాచ్‌ల తర్వాత బెంగళూరు జట్టు...
26-05-2022
May 26, 2022, 00:23 IST
లక్నో ఔట్‌.. క్వాలిఫయర్‌-2కు ఆర్‌సీబీ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ ​క్వాలిఫయర్‌-2కు చేరుకుంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 14 పరుగుల తేడాతో...
25-05-2022
May 25, 2022, 22:50 IST
విరాట్‌ కోహ్లి ఆన్‌ఫీల్డ్‌లో ఎంత అగ్రెసివ్‌గా కనిపిస్తోడో.. ఆఫ్‌ ఫీల్డ్‌లో అంత సరదాగా ఉంటాడు. తననే ఫోకస్‌ చేస్తూ కెమెరామన్‌...
25-05-2022
May 25, 2022, 22:01 IST
ఆర్‌సీబీ బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌ కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సూపర్‌ శతకంతో మెరిశాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో పాటిదార్‌... 

Read also in:
Back to Top