వార్నర్‌ వద్దా.. ఒక్క ఓవర్‌ బౌలర్‌ కావాలా?

IPL 2021:What Happened In SRH Camp After Warner Removed From All - Sakshi

ఢిల్లీ:  డేవిడ్‌ వార్నర్‌ను సన్‌రైజర్స్‌ హైదరరాబాద్‌ కెప్టెన్సీ  పదవి నుంచి,  ఆపై తుది జట్టు నుంచి తొలగించడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. ప్రస్తుతం వార్నర్‌ తొలగింపుపైనే ఎక్కవ చర్చ నడుస్తోంది. ఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు వార్నర్‌ ఆడకపోవచ్చని కోచ్‌ బెయిలీస్‌ చెప్పడం సన్‌రైజర్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో కచ్చితంగా ఏదో జరిగిందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇక వార్నర్‌ ఆరెంజ్‌ ఆర్మీలో కనిపించకపోవచ్చని, అతనికి ఈ సీజన్‌తో వారితో బంధం తీరిపోయిందని కొంతమంది విశ్లేషకులు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. 

జట్టు ప్రయోజనాల కోసం వార్నర్‌ను తప్పించినట్లు సన్‌రైజర్స్‌ క్యాంప్‌ చెబుతోంది. అసలు వారి ఆరెంజ్‌ ఆర్మీ శిబిరం లోపల ఏమి జరిగిందో అర్థం కావడం లేదు. ఈ సీజన్‌లో వార్నర్‌ కెప్టెన్‌గా విఫలం కావొచ్చు.. కానీ ఆటగాడిగా కూడా పనికిరాడా అనే కోణం చర్చకు దారి తీసింది. ఓవరాల్‌గా ఆరెంజ్‌ ఆర్మీ పటిష్టంగా లేకపోవడమే వరుస ఓ‍టములకు ప్రధాన కారణం. ఇద్దరు-ముగ్గురు ఆటగాళ్ల తప్పితే మిగతా జట్టంతా పేలవంగానే ఉంది. పేపర్‌ మీద ఆల్‌రౌండర్ల కంటే ఫీల్డ్‌లో రాణించే ఒక బ్యాట్స్‌మన్‌ ఉంటే చాలు.

రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో వార్నర్‌ స్థానంలో వచ్చింది మహ్మద్‌ నబీ. విదేశీ ఆటగాళ్ల కోటాలో వార్నర్‌ను తప్పించి నబీని వేసుకున్నారు. కేన్‌ విలియమ్సన్‌, బెయిర్‌ స్టో, రషీద్‌ ఖాన్‌లు విదేశీ ఆటగాళ్ల కోటాలో బరిలోకి దిగగా నాల్గో ప్లేయర్‌గా నబీ వచ్చాడు. నబీ ఆల్‌రౌండర్‌ కావొచ్చు.. ఎక్కడో లీగ్‌లో రాణించి ఉండవచ్చు.. కానీ ఐపీఎల్‌లో అతనికి రికార్డు ఏమీ బాలేదు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన నబీ చేసిన పరుగులు 177.

ఇక్కడ అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 31. ఇక యావరేజ్‌ 16.09గా ఉంది. బౌలర్‌గా 13 వికెట్లే తీశాడు. ఈ సీజన్‌లో నిన్నటి మ్యాచ్‌తో కలుపుకుని రెండు మ్యాచ్‌లు ఆడాడు. కేవలం రెండు వికెట్లే సాధించిన నబీ.. బ్యాటింగ్‌లో కూడా ఇరగదీసిందే లేదు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌కే పరిమితమైన నబీ 21 పరుగులిచ్చాడు. రాజస్థాన్‌ బ్యాటర్స్‌ దెబ్బకు నబీని ఓవర్‌కే పరిమితం చేశాడు కొత్త కెప్టెన్‌ విలియమ్సన్‌. రాజస్థాన్‌ 220 పరుగులు చేసినప్పుడు  జట్టులో హిట్టర్లు ఎవరున్నారు వార్నర్‌ ఉంటే బాగుండేదని ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.. వార్నర్‌ వద్దా.. ఒక్క ఓవర్‌ బౌలర్‌ కావాలా అని ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వార్నర్‌ లేకుండా సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లు గెలుస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

ఇక్కడ చదవండి: ‘నేను 30-40 పరుగులు చేశానా అనేది మ్యాటర్‌ కాదు’
ఇలా అయితే ఎలా ఛేజ్‌ చేస్తాం: విలియమ్సన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top