ముంబై ఇండియన్స్‌ అలా అయితే మొత్తం వేలం వేస్తా..!

IPL 2021: A Twitter User States MI Will Finish At Bottom In IPL 2021 - Sakshi

వెల్లింగ్టన్‌:  ఐపీఎల్‌ ట్రోఫీని ఐదుసార్లు గెలిచిన ముంబై ఇండియన్స్‌ ..ఒకవేళ ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిస్తే తన వద్ద ఉన్న ప్రతీ క్రికెట్‌ ఐటమ్‌ వేలం వేస్తానని ఆ జట్టు మాజీ లెఫ్టార్మ్‌ సీమర్‌ మెక్లీన్‌గన్‌ చాలెంజ్‌ చేశాడు. ఈ ఏడాది వేలానికి ముందు మెక్లీన్‌గన్‌ను ముంబై ఇండియన్స్‌ జట్టు నుంచి రిలీజ్‌ చేయడంతో వేలానికి రాలేదు. 2015లో ముంబై ఇండియన్స్‌ ద్వారా ఐపీఎల్‌ కెరీర్‌ను ఆరంభించిన మెక్లీన్‌గన్‌.. 56 మ్యాచ్‌ల్లో 71 వికెట్లుసాధించాడు. 

కాగా, గురువారం తన అఫీషియల్‌ ట్వీటర్‌ హ్యాండిల్‌ ద్వారా క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్‌ సెషన్‌ నిర్వహించాడు. దీనిలో భాగంగా ఒక ట్వీటర్‌ యూజర్‌ నుంచి ఊహించిన ప్రశ్న ఎదురైంది. ‘ ఈసారి ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో నిలుస్తుంది.. మీరేమంటారు’ అని ప్రశ్నించాడు. దానికి మెక్లీన్‌గన్‌ అలా ఏమీ జరగదు అని సమాధానం చెప్పాడు.

‘అవును..ముంబై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలోనే నిలుస్తుంది’ అని మళ్లీ విసిగించాడు. దాంతో విసిగిచెందిన మెక్లీన్‌గన్‌.. ‘ నువ్వు ఏమైనా మూగవాడివా.. చెబితే అర్థం కాదా’ అని కౌంటర్‌  ఇచ్చాడు. ఒకవేళ ముంబై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిస్తే తన క్రికెట్‌ సామాగ్రిని అంతా వేలంలో పెట్టి దాని ద్వారా వచ్చిన దానిని చారిటీకి ఇస్తేనని సవాల్‌ చేశాడు. దీనిని కౌంటర్‌ చేసిన ఒక అభిమాని.. నిజాలు పలుసందర్భాల్లో గాయం చేస్తాయి అని ఎద్దేవా చేశాడు. 

చదవండి: తొలి ఆటగాడు విరాట్‌ కోహ్లినే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top